Shriya Saran Daughter Name: Shriya Revealed Her Daughter Name As "RADHA" - Sakshi
Sakshi News home page

Shriya Saran: కూతురు పేరు చెప్పేసిన హీరోయిన్‌ శ్రియా సరన్‌

Published Wed, Oct 13 2021 8:24 AM | Last Updated on Thu, Oct 14 2021 12:34 PM

Shriya Saran Reveals Name of Her Baby Girl Radha - Sakshi

Shriya Saran Daughter Name: అభిమానులతో ఓ తీయని వార్త పంచుకున్నారు శ్రియ సరన్‌. దాదాపు ఏడాదిగా రహస్యంగా ఉంచిన ఆ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారామె. తాను తల్లయిన విషయాన్ని పంచుకున్నారు. ‘‘గత ఏడాది ప్రపంచం అంతా కరోనా ప్రభావంతో గందరగోళ పరిస్థితుల్లో ఉంది. కానీ ఆ క్వారంటైన్‌ సమయంలో మా ప్రపంచమే మారిపోయింది. 

అడ్వెంచర్, ఎగ్జైట్‌మెంట్, లెర్నింగ్‌తో మా ప్రపంచం నిండిపోయింది. మా జీవితాల్లోకి ఓ ఏంజిల్‌ వచ్చింది. ఆ దేవుడికి ధన్యవాదాలు’’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసి తన భర్త, కుమార్తెతో ఉన్న వీడియోను షేర్‌ చేశారు శ్రియ. వ్యాపారవేత్త ఆండ్రూ కొశ్చివ్‌ను 2018లో వివాహం చేసుకున్నారు శ్రియ. 2020లో శ్రియ ఓ పాపకు జన్మనిచ్చారు. ఆ పాప పేరు ‘రాధ’ అని శ్రియ ఓ సందర్భంలో చెప్పారు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం శ్రియ ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో నటిస్తోంది.

చదవండి: వైరల్‌ వీడియో: రెచ్చిపోయి డ్యాన్స్‌ చేసిన శ్రియా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement