
శ్రుతీహాసన్ మంచి నటి. అది అందరికీ తెలిసిందే. ఈ బ్యూటీ మంచి గాయని. అది కూడా తెలుసు. మ్యూజిక్ డైరెక్టర్ కూడా. సొంతంగా ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తుంటారు. మంచి రచయిత్రి కూడా. కవితలు రాస్తుంటారు. ఇప్పుడు ఏకంగా ఒక సినిమాకి కథ రాస్తున్నారు. ఒక తమిళ సినిమా కోసం కథ రాసే పనిలో ఉన్నారామె.
ఈ విషయం గురించి శ్రుతీహాసన్ మాట్లాడుతూ – ‘‘చెన్నైకి సంబంధం లేని ఒక వ్యక్తి గురించి ఈ కథ రాస్తున్నాను. మా నాన్నగారు నన్ను రైటర్‌గా చూడాలనుకునేవారు. చిన్నప్పుడు నేను రాసినవి చూసి పెద్ద రచయిత్రిని అవుతానని అనుకునేవారు. నన్ను సినిమా రైటర్‌ని చేయాలనుకున్నారు. అందుకే వేసవి సెలవుల్లో రైటింగ్ కోర్సులు కూడా చేశాను. ఇప్పుడు రైటింగ్ మీద బాగా దృష్టి పెట్టాలనుకున్నాను. నా జీవితంలోని ఈ కొత్త అధ్యాయం నాకు ఎగ్జయిటింగ్‌గా ఉంది’’ అన్నారు.
చదవండి: ఇన్‌స్టాగ్రామ్ రీల్స్..ఇప్పటికే..10 లక్షలకు పైగానే లైక్స్
Comments
Please login to add a commentAdd a comment