Simratt Kaur Randhawa Went Through Depression, Because Of No Work - Sakshi
Sakshi News home page

Simratt Kaur Randhawa: తెలుగులో ఒక సినిమా చేశాక కూడా ఆఫర్లు రాలే.. ఏళ్లపాటు ఖాళీగా.. డిప్రెషన్‌, రోజూ ఏడ్చేదాన్ని

Published Wed, Aug 9 2023 6:14 PM | Last Updated on Wed, Aug 9 2023 7:22 PM

Simratt Kaur Randhawa Went Through Depression, Because of No Work - Sakshi

కొందరికి సినిమానే లోకం.. కాస్త గ్యాప్‌ వచ్చినా తట్టుకోలేరు. అవకాశాల కోసం కళ్లలో వత్తులు వేసుకుని ఎదురుచూస్తారు. ఛాన్సులు రావడం ఆగిపోతే అస్సలు తట్టుకోలేరు. కుమిలిపోతారు, డిప్రెషన్‌కు లోనవుతారు. ఈ బాధను అనుభవించిన బాలీవుడ్‌ నటీమణుల్లో సిమ్రత్‌ కౌర్‌ రాంధవ ఒకరు. 2017లో వచ్చిన ప్రేమతో మీ కార్తీక్‌ అనే తెలుగు సినిమాతో హీరోయిన్‌గా తన కెరీర్‌ మొదలైంది. మొదట్లో నటనపై అంత ఆసక్తి లేనప్పటికీ ఫస్ట్‌ సినిమా రిలీజ్‌ తర్వాత వచ్చిన గుర్తింపు చూసి యాక్టింగ్‌పై ప్యాషన్‌ పెంచుకుంది. కానీ అవుట్‌సైడర్‌(సినీ బ్యాగ్రౌండ్‌ లేని వ్యక్తి)గా తనకు అవకాశాలు అంత ఈజీగా రాలేవు. తాజాగా ఆమె తన జీవితంలోని కష్ట సమయాలను తలుచుకుని ఎమోషనలైంది.

ఏం చేయాలో తెలీలేదు
సరైన సమయం వచ్చేంతవరకు ఎదురుచూడాలని తెలుసుకున్నాను. అప్పటిదాకా పోరాటం చేస్తూనే ఉండాలి. అవుట్‌సైడర్‌కు ఏదీ అంత ఈజీగా రాదు. మన దగ్గర ఎవరి ఫోన్‌ నెంబర్లు ఉండవు, పెద్దగా పరిచయాలుండవు. మనమే సరైన వ్యక్తులను వెతుక్కుని అవకాశాలు అడగాలి. అయితే నా బాధల్లా.. ఆ కరెక్ట్‌ పర్సన్స్‌ ఎక్కడుంటారు? ఎక్కడికి వెళ్లి ఆడిషన్‌ ఇవ్వాలి? అనేది తెలియలేదు. సౌత్‌లో నా జర్నీ మొదలైంది. ఒక సినిమా చేశాక కూడా నెక్స్ట్‌ ఏం చేయాలి? ఎక్కడికి వెళ్లాలి? అనేది అర్థం కాలేదు.


ప్రేమతో మీ కార్తీక్‌ సినిమా స్టిల్‌

ఎక్కడ తప్పు చేస్తున్నాను?
కొన్ని నిర్మాణ సంస్థలను కలిస్తే వారు నన్ను మెచ్చుకుని వదిలేసేవాళ్లు. నాకు ఎందుకు పని దొరకడం లేదు? ఎక్కడ తప్పు చేస్తున్నాను? అని ఆలోచించేదాన్ని. సౌత్‌లో ఒక సినిమా చేసిన తర్వాత కూడా మరో ఆఫర్‌ కోసం ఎంతగానో ప్రయత్నించాను, కష్టపడ్డాను. కానీ నా ప్రయత్నం వృధా అయింది. 2019లో నేను చాలా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. నేను ఒక ఫెయిల్యూర్‌గా ఫీలయ్యాను. జీవితంలో ఏమీ చేయలేకపోతున్నానని నలిగిపోయాను. సౌత్‌, బాలీవుడ్‌ ఎక్కడా ఛాన్సులు రావట్లేదంటే నటిగా నేను పనికిరానేమోనని తిట్టుకున్నాను.

కొన్ని నెలలపాటు ఒకే గదిలో.. రోజూ ఏడ్చేదాన్ని
కొన్ని నెలలపాటు రూమ్‌లో బందీ అయిపోయాను. ఆ గదిలో నుంచి బయటకు రాకపోయేదాన్ని. ఎవరితో మాట్లాడేదాన్ని కూడా కాదు. ప్రతిరోజు ఏడ్చేదాన్ని. అప్పుడు మా పేరెంట్స్‌ నాకు అండగా ఉన్నారు. ఎవరూ ఒక్క రాత్రిలో స్టార్‌ అయిపోరని, దాని కోసం వెయ్యిసార్లైనా పోరాడాలని చెప్పారు. యాక్టింగ్‌ వద్దనుకుంటే నాకు నచ్చింది ఇంకేదైనా చేయమన్నారు. వాళ్లు చెప్పినట్లుగానే ఎన్నో ప్రయత్నాల తర్వాత సినిమా అవకాశాలు వచ్చాయి' అని చెప్పుకొచ్చింది. సిమ్రత్‌ ప్రస్తుతం గదర్‌ 2 సినిమా చేస్తోంది. ఈ మూవీ ఆగస్టు 11న విడుదల కానుంది.

చదవండి: ఖుషి ట్రైలర్‌..  'పెళ్లంటేనే సావురా.. నువ్వెప్పుడో సచ్చిపోయినవ్‌'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement