సోషల్ మీడియా వల్ల లాభనష్టాలు రెండూ ఉన్నాయి. ఒకవైపు ఎంటర్‌టైన్‌మెంట్ దొరకడమే కాదు, మరోవైపు మోసాలు కూడా జరుగుతున్నాయి. సెలబ్రిటీ పేర్లతో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి అమాయకులను నిలువు దోపిడీ చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. టాలీవుడ్ గాయని రమ్య బెహరా విషయంలోనూ ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. తన పేరుతో ఎవరో ఫేక్ కాల్స్ చేస్తున్నారని తెలుసుకున్న రమ్య బెహరా వెంటనే తన అభిమానులను అప్రమత్తం చేసింది.
తన పేరు మీద ఎవరో ఫేక్ కాల్స్ చేస్తున్నారని, ఆ నంబర్‌ను స్క్రీన్‌షాట్ చేస్తూ ఇది తనది కాదని స్పష్టం చేసింది. ఆ నంబర్ నుంచి ఫోన్ కాల్స్ వస్తే స్పందించవద్దని, వెంటనే బ్లాక్ చేయమని సూచించింది. కాగా రమ్య బెహరా.. తెలుగులో చాలా సాంగ్స్ పాడింది. ప్రభాస్ నటించిన 'బాహుబలి'లో ధీవర సాంగ్ పాడి ఒక్కసారిగా పాపులారిటీ సంపాదించుకుంది. టెలివిజన్ కార్యక్రమాల్లోనూ పాల్గొని బుల్లితెర ప్రేక్షకులను అలరించింది.
Comments
Please login to add a commentAdd a comment