విని పాడటమే కానీ మ్యూజిక్‌ నేర్చుకోలేదు | Singer Yasaswi And His New Song Teammates Interview | Sakshi
Sakshi News home page

మ్యూజిక్‌ నేర్చుకోలేదు: యశస్వి కొండేపూడి

Published Sat, Nov 7 2020 8:02 AM | Last Updated on Sat, Nov 7 2020 10:33 AM

Singer Yasaswi And His New Song Teammates Interview - Sakshi

జాను సినిమాలో సూపర్‌ డూపర్‌ హిట్టయిన ‘ఏ దారెటు వెళుతున్నా..’ పాట ఈ మధ్య మరో గొంతులో వీనుల విందు చేసింది. జీ సరిగమప పాటల పోటీ సందర్భంగా ఈ పాటను పాడిన యశస్వి గాత్రం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. యశస్వి సహా కంటెస్టెంట్స్‌తో కలిసి దసరా పండగ ప్రత్యేక గీతాన్ని సైతం ఆలపించడం విశేషం. కరోనా కాలంలో.. లాక్‌డౌన్‌  పరిస్థితుల్లో.. భవిష్యత్‌ ఏమిటో అర్థంకాక కూర్చున్నవారే కాదు కొత్త దారులను అన్వేషించినవారూ.. పాత అభిరుచులకు పట్టం కట్టినవారూ ఉన్నారు. వేర్వేరు మార్గాల్లో కెరీర్‌ వెతుక్కుంటున్న యువత.. పాటల పోటీల్లో పాల్గొంటూనే సోషల్‌ మీడియా ద్వారా పాపులర్‌ కావడం మరోవైపు దసరా పండుగ కోసం విడుదల చేసిన కొత్తపాట ద్వారా ప్రజలకు పరిచయం అయ్యే అవకాశం కూడా దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఆ లక్కీ యూత్‌తో ముచ్చటించినప్పుడు తమ అనుభూతుల్ని పంచుకున్నారిలా.    
– సాక్షి, సిటీబ్యూరో 

ఆన్‌లైన్‌ ఆడిషన్స్‌కి సెలెక్ట్‌ అయ్యా.. 
సిటీలోనే పుట్టి పెరిగా. కేశవ్‌ మెమోరియల్‌ ఇన్‌స్టిట్యూట్‌లో బీటెక్‌ చేశా. రెండేళ్లు ఐటీ సెక్టార్‌లో పనిచేశాను. రెండో తరగతి నుంచి క్లాసికల్‌ మ్యూజిక్‌ నేర్చుకున్నా. ఆన్‌లైన్‌ ఆడిషన్స్‌కి వీడియో పంపి సెలక్టయ్యా. పోటీదారుల నుంచి ఎంతో నేర్చుకుంటున్నా. కెరీర్‌ ప్రారంభంలోనే సొంత కంపోజిషన్‌లో కొత్త పాట పాడటం చాలా గ్రేట్‌. తొలి సారి మా పాట స్టూడియోలో పాడి రికార్డ్‌ చేయడం గ్రేట్‌ అనిపించింది.  
 – అనన్య భాస్కర్, హైదరాబాద్‌. 

చదవండి: కనకవ్వ: అన్నీ బతుకుపాటలే..

అభిరుచి తీర్చుకునే ఛాన్స్‌ 
మాది మహబూబ్‌నగర్‌.. సరోజిని రాములమ్మ ఫార్మసీ కాలేజ్‌లో ఫార్మసీ పూర్తి చేశా. పెళ్లి కూడా అయిపోయింది. చిన్నప్పటి నుంచీ క్లాసికల్‌ మ్యూజిక్‌ నేర్చుకున్నా. సింగింగ్‌ పోటీలంటే చాలా ఇష్టం. కానీ రకరకాల బిజీల కారణంగా పాల్గొనడం కుదర్లేదు. లాక్‌డౌన్‌ సమయంలో నా చిన్ననాటి అభిరుచిని తీర్చుకునే ఛాన్స్‌ వచ్చింది. అంతేగాకుండా సొంతంగా ఓ పాట పాడటం చాలా కిక్‌ ఇస్తోంది. నా పర్ఫార్మెన్స్‌ పట్ల మా పేరెంట్స్, భర్త చాలా హ్యాపీ అవుతున్నారు.      
– ప్రజ్ఞ, మహబూబ్‌నగర్‌. 

డిజిటల్‌ ఆడిషన్స్‌ ద్వారా.. 
మేం సిటీలోని విద్యానగర్‌లో నివసిస్తున్నాం. ప్రస్తుతం అరోరా డిగ్రీ పీజీ కాలేజ్‌లో చదువుతున్నా. నేను 3వ తరగతిలో ఉండగానే క్లాసికల్‌ మ్యూజిక్‌ నేర్చుకోవడం ప్రారంభించా. అయితే కరోనా వల్ల పూర్తిస్థాయిలో సంగీతం మీద ఏకాగ్రత నిలపగలిగాను. అలా సరిగమప టీమ్‌లో వచ్చిన యాడ్‌ చూసి డిజిటల్‌ ఆడిషన్స్‌ ద్వారా ఎంపికయ్యా. పోటీలో గెలుపోటముల సంగతెలా ఉన్నా.. అప్పుడే ఒక కొత్త పాట పాడే అవకాశం రావడం బాగా అనిపిస్తోంది.
– భరత్‌ రాజ్, విద్యానగర్‌ 

సాఫ్ట్‌వేర్‌ టూ సాంగ్స్‌ వేవ్‌..
మాది విజయనగరం జిల్లా బొబ్బిలి. కాగ్నిజెంట్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ని. స్వతహాగా మ్యూజిక్‌ నేర్చుకోలేదు మా తాతగారు మ్యూజిక్‌ టీచర్‌గా పనిచేశారు. చిన్నప్పుడు ఇంట్లో ఎవరో ఒకరు పాడుతూ ఉండేవారు. అలా నాకు మ్యూజిక్‌ ఇంట్రెస్ట్‌ వచ్చిందేమో. లాక్‌డౌన్‌ టైమ్‌లో బెంగళూర్‌లో ఉన్నాను. ఫ్రీ టైమ్‌ కాబట్టి పోటీలకు అప్లయ్‌ చేశానే తప్ప సెలక్ట్‌ అవుతానని, గెలుస్తానని కాదు. కనీసం జడ్జిలను చూసి వెళ్లినా చాలనుకున్నా. అలాంటిది ఏకంగా ఓ కొత్త పాటపాడే అవకాశం వచ్చింది.  
– వెంకట్‌ చైతన్య. 

ఎగ్జయిటింగ్‌గా ఫీలవుతున్నా.. 
ఆంధ్రా మెడికల్‌ కాలేజ్‌లో ఎంబీబీఎస్‌ చదువుతున్నా. మా అమ్మా, నాన్న పాటలు పాడుతుంటారు. అలా విని నేర్చుకోవడమే కానీ మ్యూజిక్‌ నేర్చుకోలేదు. అయితే పాటలంటే బాగా ఇష్టం. ఇటీవల కాస్త సమయం దొరకడంతో మరింత బాగా వినడం, పాడటం చేశా. అదే క్రమంలో సరదాగా జీ సరిగమప ఆడిషన్స్‌కు అప్లయ్‌ చేశా. ఏదేమైనా ఈ పాట రిలీజ్‌ గురించి ఎగ్జయిటింగ్‌గా ఫీలవుతున్నా. ఇటీవల నేను పాడిన పాటకి జడ్జిల నుంచే కాకుండా సోషల్‌ మీడియాలో సంగీత ప్రియుల నుంచి కూడా పేరు రావడం ఆనందంగా ఉంది. – యశస్వి కొండేపూడి,  కాకినాడ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement