హీరోయిన్ సోనారిక భడోరియా పెళ్లి పీటలెక్కనుంది. ప్రియుడు, వ్యాపారవేత్త వికాస్ పరశార్‌ను పెళ్లాడనుంది. రాజస్తాన్‌లో ఫిబ్రవరి 18న వీరి వివాహం జరగనుంది. వికాస్ సొంతూరైన హర్యానాలోని ఫరీదాబాద్‌లో రిసెప్షన్ జరగనున్నట్లు సోనారిక తెలిపింది. నిజానికి వీరిద్దరూ 2022 డిసెంబర్‌లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ఏడాదికిపైగా విరామం తీసుకుని ఇన్నాళ్లకు పెళ్లికి సిద్ధమవుతున్నారు.
గోవాలో రోకా..
కాగా ఈ జంట ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆ మధ్య సోనారిక తెలుపుతూ.. 'మేము ఎంతోకాలంగా ప్రేమలో ఉన్నాం. 2022 మేలో మాల్దీవులకు వెళ్లినప్పుడు వికాస్.. పెళ్లి చేసుకుంటావా అని ప్రపోజ్ చేశాడు. అప్పుడు ఇద్దరమే ఉన్నాం. ఆ సమయంలో మా ఇరు కుటుంబసభ్యులు కూడా ఉంటే బాగుండనిపించింది. వాళ్లు సెలబ్రేషన్స్ మొదలుపెడదామన్నారు. నాకేమో ఏదైనా సింపుల్‌గానే చేయాలనిపిస్తుంది. తనకేమో ప్రతీది గ్రాండ్‌గా ఉండాలంటాడు. మా ఇద్దరికీ సముద్రతీరమంటే ఇష్టం. అలా మా రోకా గోవా బీచ్‌లో జరుపుకున్నాం' అని చెప్పుకొచ్చింది.
సీరియల్స్, సినిమాలు..
కాగా ఈ బ్యూటీ దేవాన్ కె దేవ్.. మహదేవ్ అనే సీరియల్‌లో పార్వతి దేవిగా నటించింది. దస్తాన్ ఇ మొహబ్బత్ సలీమ్ అనార్కలి సీరియల్‌లో అనార్కలిగా నటించింది. ఇంకో రెండు మూడు సీరియల్స్ కూడా చేసింది. బుల్లితెరకే పరిమితమైపోకుండా వెండితెరపైనా అలరించింది. జాదూగాడు, స్పీడున్నోడు, ఈడోరకం ఆడోరకం చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. అయితే తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో మళ్లీ ఇక్కడ నటించలేదు.
చదవండి: అటల్ బిహారీ వాజ్‌పేయి బయోపిక్‌పై పబ్లిక్ రెస్పాన్స్ ఇదే
Comments
Please login to add a commentAdd a comment