పేరెంట్స్‌కు ఖరీదైన గిఫ్ట్‌ ఇచ్చిన యాంకర్‌ శ్రీముఖి | Sreemukhi Surprise Gifts To Her Parents On Diwali | Sakshi
Sakshi News home page

Sreemukhi: కొత్తింట్లో దీపావళి.. పేరెంట్స్‌కు ఖరీదైన గిఫ్ట్‌.. ఎంతైనా ఆమె మనసు బంగారం!

Published Fri, Nov 17 2023 12:14 PM | Last Updated on Fri, Nov 17 2023 12:25 PM

Sreemukhi Diwali Surprise Gifts to Her Parents - Sakshi

ఆమె మాట్లాడితే థౌజండ్‌వాలా టపాసులు పేలినట్లు ఉంటాయి. అంత పెద్ద గొంతు మాత్రమే కాదు, అంతటి హుషారు, ఉత్సాహం కూడా ఆమె మాటల్లో ధ్వనిస్తుంటుంది. ఆ లేడీ యాంకరే శ్రీముఖి. నిజామాబాద్‌ ముద్దుబిడ్డ అయిన శ్రీముఖి బుల్లితెరపై టాప్‌ యాంకర్‌గా రాణిస్తోంది. ఆ మధ్య బిగ్‌బాస్‌ మూడో సీజన్‌లోనూ పాల్గొంది. ఇప్పటికీ స్టార్‌ యాంకర్‌గా సత్తా చాటుతున్న ఆమె దీపావళి పండగను నిజామాబాద్‌లో కొత్తింట్లో తన ఫ్యామిలీతో సెలబ్రేట్‌ చేసుకుంది.

వాళ్లకు స్వీట్లు.. వీరికి బంగారు బహుమతులు
ముందుగా ఇంట్లో పూజ చేసుకున్నాక ఆ పూజకు వచ్చిన అతిథులంందరికీ స్వీట్లు పంచారు. ఆ తర్వాత పేరెంట్స్‌కు ఖరీదైన గిఫ్ట్‌ ఇచ్చింది. తండ్రి రామకృష్ణకు బంగారు చైన్‌ బహుమతిగా ఇవ్వగా తల్లి లతకు వజ్రాల ఆభరణాన్ని అందించింది. ఇది చూసి శ్రీముఖి తల్లి ఒక్కసారిగా షాకైంది. డైమండ్‌ నెక్లెస్‌.. చాలా బాగుంది అని మురిసిపోయింది. ఇలా వారికి ఊహించని బహుమతులిచ్చి పండక్కి తల్లిదండ్రుల ముఖాల్లో సంతోషాన్ని తీసుకొచ్చింది శ్రీముఖి.

జీవితాన్ని ప్రసాదించింది వీళ్లే
'ఒకప్పుడు మాది మధ్యతరగతి కుటుంబం. ఒకే గదిలో ఉంతా ఉండేవాళ్లం. ఆ స్థాయి నుంచి ఒక్కో మెట్టు ఎదిగి ఈ రోజు ఇంత పెద్ద ఇంట్లో దీపావళి పండగను జరుపుకోగలుగుతున్నామంటే అందుకు నా పేరెంట్సే కారణం. మాకు ఇంత జీవితాన్ని ఇచ్చినందుకు వారికి మా తరపున ఈ చిన్న బహుమతి ఇచ్చాం అంటూ వారి కాళ్ల మీద పడి ఆశీర్వాదాలు తీసుకున్నారు శ్రీముఖి, ఆమె తమ్ముడు శుశ్రుత్‌. ఇది చూసిన జనాలు ఎంతైనా శ్రీముఖి మనసు బంగారం అని కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: 19 ఏళ్లకే పెళ్లి.. ఫేక్‌ స్మైల్‌.. రెండో పెళ్లి గురించి విమర్శలు.. ఎన్నో బాధలు.. ఎంతో ఏడ్చా: సింగర్‌ సునీత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement