Sri Manas Oorellipota Mama Movie Streaming On Aha - Sakshi
Sakshi News home page

Oorellipota Mama Movie: ఆహా అనిపిస్తున్న మానస్‌ 'ఊరెళ్లిపోతా మామ'..

Published Sun, Jul 10 2022 8:01 PM | Last Updated on Sun, Jul 10 2022 8:53 PM

Sri Manas Oorellipota Mama Movie Streaming On Aha - Sakshi

Sri Manas Oorellipota Mama Movie: పాత సినిమాల నుంచి.. నిజ జీవితం నుంచి నిరంతరం నేర్చుకుంటూ తనను తాను నటుడిగా.. వ్యక్తిగా తీర్చిదిద్దుకుంటున్నానని అంటున్నాడు యంగ్‌ హీరో శ్రీ మానస్. హైదరాబాద్‌కు చెందిన శ్రీ మానస్ నటించిన "ఊరెళ్లిపోతా మామ" చిత్రం అసలు సిసలు తెలుగు ఓటీటీ "ఆహా"లో మంచి స్పందన అందుకుంటోంది. మెరీనా సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో వరుణ్, శుభలేఖ సుధాకర్, మహేష్ విట్టా, టిఎన్ఆర్, మ్యాడి, సెహరా పద్మా జయంతి ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని అంజన్ రెడ్డి దర్శకత్వంలో తాడిపత్రి వెంకట కొండారెడ్డి, జి దామోదర్ రెడ్డి, ఎస్ మారుతి ప్రసాద్, కె హిమాన్విత్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా విజయం సాధించడంపట్ల శ్రీ మానస్‌ సంతోషం వ్యక్తం చేశాడు. 

శర్వానంద్, శ్రీ విష్ణు వంటి హీరోలను పరిచయం చేసిన దొరైరాజ్ దర్శకత్వంలో రూపొందిన "పటారుపాలెం ప్రేమకథ"తో హీరోగా పరిచయమైన శ్రీ మానస్.. తనను హీరోగా పరిచయం చేసిన దొరైరాజ్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటానని చెబుతున్నాడు. త్వరలో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న "పొట్లగిత్త" చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు శ్రీ మానస్‌. ఈ మూవీకి వెంకట్ దర్శకత్వం వహిస్తున్నారు. హీరోగా మాత్రమే కాదు.. ప్రాధాన్యం ఉన్న పాత్రలు వస్తే "క్యారెక్టర్స్ రోల్స్" చేయడానికి సైతం తాను సిద్ధమేనంటున్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement