
Srikanth Kothala Rayudu Movie All Set To Release: శ్రీకాంత్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కోతల రాయుడు’. సుధీర్ రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో డింపుల్ చోపడే, నటాషా దోషి హీరోయిన్లుగా నటించారు. ఏఎస్‌కే ఫిలిమ్స్ పతాకంపై ఏ.ఎస్.కిషోర్, కొలన్ వెంకటేష్ నిర్మించిన ఈ మూవీ ఫిబ్రవరి 4న విడుదల కానుంది.
ఈ సందర్భంగా సుధీర్ రాజు మాట్లాడుతూ–‘‘ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో వినోదం, ఫైట్స్ బాగున్నాయి. కుటుంబమంతా చూడదగ్గ సినిమా ఇది. శ్రీకాంత్ పాత్ర అందరికీ కనెక్ట్ అవుతుంది’’ అన్నారు. ‘‘కోతల రాయుడు’ మా బ్యానర్‌కి, యూనిట్‌కి మంచి పేరు తెచ్చిపెడుతుందనే నమ్మకం ఉంది’’ అని ఏ.ఎస్.కిషోర్, కొలన్ వెంకటేష్ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్, కెమెరా: సతీష్.జి.