
దక్షిణాదితో పాటు హిందీలోనూ ఈ అమ్మడు సరైన విజయాన్ని అందుకొని చాలా కాలమే అయ్యింది. అయినప్పటికీ తమిళంలో రజనీకాంత్ వంటి సూపర్‌స్టార్‌తో జైలర్ చిత్రంలోనూ, తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన
తన పదిహేనో ఏటనే కథానాయకిగా సినీ రంగప్రవేశం చేసిన ఉత్తరాది బ్యూటీ తమన్నా భాటియా. మొదట బాలీవుడ్‌లో పరిచయమైన ఈ లక్కీ బ్యూటీని ఆదరించింది మాత్రం దక్షిణాది సినిమానే. ఆదిలో తన లేలేత అందాలతో యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేసినా, ఆ తరువాత మాత్రం తనలోని నటనా కౌశల్యాన్ని చాటుకునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో గత 18 ఏళ్లుగా కథానాయకిగా రాణిస్తోంది. మధ్యలో తనదైన స్టైల్‌లో ఐటమ్ సాంగ్స్‌లో ఆడిపాడుతోంది.
ఇప్పటికీ చేతినిండా చిత్రాలతో బిజీగానే ఉంది. అయితే దక్షిణాదితో పాటు హిందీలోనూ ఈ అమ్మడు సరైన విజయాన్ని అందుకొని చాలా కాలమే అయ్యింది. అయినప్పటికీ తమిళంలో రజనీకాంత్ వంటి సూపర్‌స్టార్‌తో జైలర్ చిత్రంలోనూ, తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన భోళా శంకర్ చిత్రంలో నటించే అవకాశాలను అందుకోవడం గొప్పే. మరో విశేషం ఏంటంటే ఈ రెండు చిత్రాలు ఒకేసారి తెరపైకి రావడానికి సిద్ధం కావడం.
జైలర్ ఆగస్టు 10వ తేదీన భోళాశంకర్ ఆగస్టు 11వ తేదీన తెరపైకి రానున్నాయి. దీంతో నటి తమన్నా తెగ సంతోషపడిపోతోంది. తాను నటించిన రెండు భారీ చిత్రాలు ఒకేసారి విడుదల కానుండడంపై ఆనందం వ్యక్తం చేసింది. కాగా తమన్న వీరితో పాటు తమిళంలో అరణ్మణై–4, మలయాళంలో బాంద్రా అనే చిత్రం, బాలీవుడ్‌లో బోల్ చుడియన్ అనే చిత్రంలోనూ నటిస్తోంది.
చదవండి: యాంకర్ ఝాన్సీతో విడాకులు, పాప కోసం అల్లాడిపోయిన జోగి నాయుడు