Vijay Beast Movie: Tamil Nadu Muslim League President Mustafa Shock To Vijay Beast - Sakshi
Sakshi News home page

Vijay Beast Movie: తమిళనాడులో కూడా విజయ్ 'బీస్ట్'కు చుక్కెదురు!

Published Thu, Apr 7 2022 12:49 AM | Last Updated on Thu, Apr 7 2022 11:09 AM

Tamil Nadu Muslim League President Mustafa Shock To Vijay Beast - Sakshi

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన భారీ చిత్రం 'బీస్ట్'. పూజా హెగ్డే కధానాయికగా నటించిన ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. కళానిధి మారన్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ చిత్రం విడుదలకు ముందే అనేక అడ్డంకులను ఎదుర్కొంటోంది. ఇటీవలే ఈ సినిమాని కువైట్‌లో నిషేధించారు.

ఇక తాజాగా చిత్రంలో ఇస్లాంవాదులను తీవ్రవాదులుగా చిత్రీకరించారంటూ తమిళనాడు ముస్లిం లీగ్‌ అధ్యక్షుడు ముస్తఫా 'బీస్ట్'ను తమిళనాడులో సైతం నిషేధించాలంటూ డిమాండ్‌ చేశాడు. ఈ మేరకు ముస్తఫా తమిళనాడు రాష్ట్ర హోం శాఖ కార్యదర్శికి లేఖ రాసినట్లు సమాచారం. ఇలా విజయ్ సొంత రాష్ట్రమైన తమిళనాడులోనే బీస్ట్' చిత్రం పై నిరసనలు వెల్లువెత్తుతుండటంతో ఏప్రిల్ 13న ఈ సినిమా విడుదలపై అంతటా ఆసక్తి నెలకొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement