వివక్ష చూపినప్పటికీ తన ప్రతిభనే నమ్ముకుంది. అందుకే అతికొద్ది కాలంలోనే బుల్లితెర నటి నుంచి వెండితెర నటిగా ఎదిగి, సైఫ్ అలీఖాన్, డింపుల్ కపాడియా, గౌహర్ ఖాన్ వంటి స్టార్స్ మధ్యలో నటించే అవకాశం దక్కించుకుంది కృతికా కమ్రా. రాజకీయ వెబ్ సిరీస్ ‘తాండవ్’తో వెబ్ వీక్షకులూ అభిమాన నటి అయింది.
కృతికా కమ్రా మధ్యప్రదేశ్‌లోని బరేలీలో 1988 అక్టోబర్ 25న జన్మించింది. తండ్రి రవి కమ్రా..డాక్టర్, తల్లి కుమ్‌కుమ్ కమ్రా, తమ్ముడు రాహుల్ కమ్రా.
2007లో ‘యహా కే హమ్ సికందర్’ అనే టీవీ షోతో ఇండ్రస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.
న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ కోర్సు చేశారు.
కృతి ముందు ఫ్యాషన్ డిజైనర్‌గా రాణించాలనుకుంది. కానీ, ‘కిత్నీ మొహబ్బత్ హై’ సీరియల్‌లో లీడ్‌రోల్‌లో అవకాశం రావడంతో కోర్సును మధ్యలోనే వదిలేసింది. అదే ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. సీరియల్‌లోని అరోహీ పాత్రను ప్రేక్షకులు తమ సొంత అమ్మాయిలాగా ఆదరించడంతో బాగా ప్రాచుర్యం పొందారు.
2014లో ‘ఝలక్ దిఖ్‌లాజా 7’ అనే రియాల్టీ షోలోనూ పాల్గొంది. ఆ తర్వాత 2015లో ‘ఎమ్‌టీవీ వెబ్‌డ్ సీజన్2’లో హోస్ట్‌గా చేశారు.
2018లో మొదటిసారిగా బుల్లితెర నుంచి బాలీవుడ్‌లోకి ‘మిత్రోం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అయితే, మిత్రోంతో పాటు ఆ తర్వాత నటించిన జాకీ భగ్నాని, ప్రతీక్ గాంధీ, నీరజ్ సూద్ సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా ఆడలేదు.
కృతి ‘ప్యార్ కా బంధన్’, ‘గంగా కీ ధీజ్’, కిత్నీ మొహబ్బత్ హై2’, ‘రిపోర్టర్స్’, ‘ప్రేమ్ యా పహేలీ’, ‘చంద్రకాంత’ వంటి టీవీ సీరియల్స్‌లోనూ నటించారు.
వివిధ మ్యూజిక్ ఆల్బమ్స్‌ను సేకరించడం హాబీ. డాన్స్ అంటే చాలా ఇష్టం.
బాలీవుడ్‌లో ఎంతోమంది నటులు ఎదుర్కొంటున్న వివిక్షను నేను కూడా అనుభవించాను. కానీ, అవేవీ నా ఈ ప్రయాణాన్ని ఆపలేదు. ఎందుకంటే అవకాశాలు అనేవి ప్రతిభ ఉంటేనే వస్తాయని నేను నమ్ముతాను.
(చదవండి: అమ్మతో సమయం గడపండి: అర్జున్ కపూర్)
Comments
Please login to add a commentAdd a comment