'సుందరాంగుడు' సినిమా హీరో కృష్ణ సాయిపై తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై ప్రశంసలు కురిపించారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండేలా యువతకు, వారి తల్లిదండ్రులకు చైతన్యం తీసుకురావడం లక్ష్యంగా తాము నిర్వహిస్తున్న కృష్ణ సాయి ఇంటర్నేషనల్ చారిటబుల్ ట్రస్టు ద్వారా కృష్ణసాయి చేస్తున్న ప్రయత్నాన్ని గవర్నర్ అభినందించారు. సామాజిక అవగాహనలో భాగంగా MSK ప్రమిద శ్రీ ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ప్రొడక్షన్ నం. 2 చిత్రంలో Danger ‘say no to Drugs..’ అనే ప్రత్యేక పాటను చిత్రీకరించారు. దర్శకుడు పిఎస్ నారాయణ రాసిన ఈ పాటలో హీరో కృష్ణ సాయి నటించారు.
(ఇదీ చదవండి: హీరోకు ఏ మాత్రం తగ్గకుండా నటించిన ఈ 'మున్నీ' ఇప్పుడెలా ఉందంటే?)
చాలా మంది యువత డ్రగ్స్ ఊబిలో చిక్కుకుని జీవితాలను నష్టపోతున్నారని, డ్రగ్స్ నిర్మూలనపై తమ కృష్ణ సాయి ఇంటర్నేషనల్ చారిటబుల్ ట్రస్టు ద్వారా అవగాహన కల్పిస్తున్నామని హీరో కృష్ణ సాయి తెలిపారు. డ్రగ్స్ అలవాటు పడిన వారు బయటకు రాలేకపోతున్నారని, నగరాల్లో డ్రగ్స్ బాధితులు చాలా మంది ఉంటున్నారని చెప్పారు.
వారికి సరైన గైడెన్స్ దొరకడం లేదని, వారికి అవగాహన కల్పించేందుకు తాము ఆగస్టులో హైదరాబాద్‌లో సెమినార్ నిర్వహించబోతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళసైని ఆహ్వానించామని కృష్ణసాయి చెప్పారు. తమ ప్రయత్నాన్ని అభినందించిన గవర్నర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment