
దళపతి విజయ్ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలు చేస్తున్నారు. ప్రస్తుతం లియో చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నటి త్రిష నాయకిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని క్రేజీ దర్శకుడు లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్నారు. చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. లియో చిత్రాన్ని దీపావళి సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీంతో నటుడు విజయ్ తదుపరి చిత్రానికి సిద్ధమవుతున్నారు. దీనికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించబోతున్నారు.
ఇటీవల ఈయన దర్శకత్వం వహించిన ద్విభాషా చిత్రం కస్టడీ ఆశించిన విజయాన్ని సాధించకపోయినా వెంటనే దళపతి విజయ్ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం రావడం నిజంగా లక్కే. ఇదే ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. కాగా ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది.
ఇందులో నటుడు, దర్శకుడు ఎస్‌జే సూర్య ప్రతినాయకుడిగా నటించనున్నట్లు తాజా సమాచారం. కాకపోతే ఇందులో విజయ్‌తో జతకట్టే హీరోయిన్ కోసం చర్చలు జరుపుతున్న లిస్ట్ పెద్దగానే ఉన్నట్లు తెలుస్తోంది. నయనతార, తమన్న, కృతిశెట్టి, కల్యాణి ప్రియదర్శన్, మృణాల్ ఠాకూర్‌లో ఒకరిని ఎంపిక చేసి పనిలో దర్శక నిర్మాతలు ఉన్నట్లు సమాచారం.
అయితే వీరిలో నటి కృతిశెట్టికే దళపతి అవకాశం ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బ్యూటీ ఇంతకుముందు వెంకట్‌ప్రభు దర్శకత్వంలో కస్టడీ చిత్రంలో నటించింది. కాగా ఇందులో హీరోయిన్ ఎవరనే సస్పెన్స్ త్వరలోనే విడిపోతుంది. జూన్ 22న విజయ్ 68వ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుందని చిత్రవర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment