తెలుగులో తొలి సినిమా.. 25 ఏళ్ల తర్వాత ఇప్పుడిలా తిరుపతిలో | Thammudu Movie Actress Aditi Govitrikar Latest Pic | Sakshi
Sakshi News home page

Guess The Actress: పవన్‌తో ఫస్ట్ మూవీ.. ఈ హీరోయిన్‌ని గుర్తుపట్టారా?

Published Fri, Nov 15 2024 1:41 PM | Last Updated on Fri, Nov 15 2024 3:03 PM

Thammudu Movie Actress Aditi Govitrikar Latest Pic

దాదాపు 25 ఏళ్ల క్రితం తెలుగులో హీరోయిన్‌గా అరంగేట్రం చేసిందీ బ్యూటీ. మళ్లీ ఇన్నేళ్లకు తిరుమల కొండపై కనిపించింది. ఈమెని చూసి తొలుత గుర్తుపట్టలేదు కానీ తర్వాత ఈమె ఎవరో తెలిసి అవాక్కవుతున్నారు. అప్పటికీ ఇప్పటికీ ఎంత మారిపోయిందో అని అనుకుంటున్నారు. మరి ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?

'హే పిల్లా నీ పేరు లవ్లీ.. జారిపోకే చేపల్లే తుళ్లి.. జాంపండులా ఉన్నావే బుల్లి' ఈ పాట వినగానే మీకు పవన్ కల్యాణ్ గుర్తొస్తారు కదా! ఇదే సాంగ్‌లో ఓ హీరోయిన్ కూడా ఉంటుంది. పైన ఫొటోలో కనిపిస్తున్నది ఆమెనే. ఈ బ్యూటీ పేరు అదితి గోవిత్రికర్. ముంబైకి చెందిన అదితి స్వతహాగా డాక్టర్. కానీ ఈ కోర్స్ చేస్తున్న టైంలోనే మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది. పలు యాడ్స్‌లో కనిపించి తెలుగులో 'తమ్ముడు' మూవీలో ఛాన్స్ కొట్టేసింది.

(ఇదీ చదవండి: సిగ్గు లేకుండా నన్ను కమిట్‌మెంట్ అడిగాడు: హీరోయిన్ కావ్య థాపర్)

1999లో 'తమ్ముడు' సినిమాతో కాస్త గుర్తింపు తెచ్చుకున్న అదితి.. 'మౌనమేలనోయి' అని మరో తెలుగు మూవీ చేసింది. దీని తర్వాత పూర్తిగా హిందీకే పరిమితమైపోయింది. 2021 వరకు హిందీ, మరాఠీ భాషల్లో పలు సినిమాల్లో నటించింది. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. లాక్ డౌన్ తర్వాత నాలుగైదు వెబ్ సిరీసుల్లోనూ కీలక పాత్రలు చేసింది. ప్రస్తుతానికైతే కొత్త ప్రాజెక్టులేం ఈమె చేతిలో లేవు.

తాజాగా శుక్రవారం తిరుమల శ్రీవారిని అదితీ గోవిత్రికర్ దర్శించుకుంది. బయటకొచ్చిన తర్వాత ఈమెని వీడియో తీసిన కొందరు, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో 'తమ్ముడు' హీరోయిన్ ఎంతలా మారిపోయిందోనని మాట్లాడుకుంటున్నారు. అదితి వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.1998లో ముఫ్పాజాల్ లక్డావాలా అనే డాక్టర్‌ని దాదాపు ఏడేళ్ల పాటు ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఇద్దరు పిల్లలు పుట్టారు. కానీ మనస్పర్థలతో 2009లో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఈమె పిల్లలతో కలిసి ఉంటోంది.

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 12 సినిమాలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement