
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కరోనా బారిన పడ్డారు. కోవిడ్ రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ పాజిటివ్‌గా నిర్దారణ అయ్యిందని ట్విటర్‌లో వెల్లడించారు. స్వల్ప లక్షణాలు ఉండటంతో వైద్యుల సలహాలతో ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారు కోవిడ్ టెస్ట్‌లు చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని, అందరూ వ్యాక్సిన్ తప్పకుండా తీసుకోవాలని సూచించారు. కాగా ఇప్పటికే మహేశ్ వదిన, నమ్రతా అక్క అయినా శిల్పా శిరోద్కర్‌కు కరోనా సోకిన విషయం తెలిసిందే. శిల్పా ప్రస్తుతం దుబాయ్‌లో నివసిస్తున్నారు.
చదవండి: రెండేళ్లుగా తప్పించుకున్నా.. కానీ ఇప్పుడు దొరికిపోయా : మంచు లక్ష్మీ
— Mahesh Babu (@urstrulyMahesh) January 6, 2022
Comments
Please login to add a commentAdd a comment