Trolls On Actor Kiran Abbavaram Over His Tweet on Kantara Movie Goes Viral - Sakshi
Sakshi News home page

Kiran Abbavaram Tweet: కిరణ్ అబ్బవరం ట్వీట్.. దారుణంగా నెటిజన్స్ ట్రోల్స్

Published Sun, Oct 23 2022 4:54 PM | Last Updated on Sun, Oct 23 2022 6:21 PM

Tollywood Young Hero Kiran Abbavaram Tweet On Kantara Movie Goes Viral - Sakshi

దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తున్న మూవీ కాంతార. రిషబ్ శెట్టి దర్శకుడిగా, హీరోగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు బద్దలు కొడుతోంది. ఇప్పటికే వారం రోజులు పూర్తి చేసుకున్న ఈ మూవీ రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్తోంది.  ఈ సినిమా భారీ విజయం సాధించడం పట్ల పలువురు సినీ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. టాలీవుడ్ ప్రముఖులతో పాటు బాలీవుడ్ నటులు సైతం రిషబ్‌ శెట్టిని పొగుడుతున్నారు.  అయితే తాజాగా ఈ సినిమాపై టాలీవుడ్ యంగ్ నటుడు కిరణ్ అబ్బవరం ఓ ట‍్వీట్ చేశారు. అది కాస్తా వైరల్ కావడంతో నెటిజన్స్ ఆయనపై మండిపడుతున్నారు. అసలు కిరణ్ ట్వీట్‌లో ఏముంది? నెటిజన్స్ ఎందుకు ఫైరవుతున్నారు ఓ లుక్కేద్దాం. 

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ‘కాంతార’ సినిమాపై తన అభిప్రాయాన్ని ట్వీట్ రూపంలో షేర్ చేశాడు. 'నువ్వు సినిమాలు చెయ్యడం మానేయ్ బ్రో' అంటూ నెగెటివ్ కామెంట్స్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. కిరణ్ ట్వీట్ చేస్తూ..  'నేను చిన్నప్పటి నుంచి మా ఊరిలో చూసిన కల్చర్ ని స్క్రీన్ పైన చూడడం చాలా బాగా అనిపించింది' అంటూ రాసుకొచ్చాడు. ఆ పోస్ట్‌లో తప్పేం లేనప్పటికీ.. నెటిజన్లు మాత్రం కావాలనే కిరణ్ టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. 'కిరణ్ బ్రో నువ్వు కూడా ప్రస్తుతం చేసే  మూవీస్ ఆపేసి కొత్తగా ట్రై చెయ్ బ్రో.. అప్పుడే మంచి గుర్తింపు వస్తుంది నీకు’’ అని సలహాలు ఇస్తున్నారు. 'గ్రేట్ అన్నా.. నువ్వు సినిమాలు ఎప్పుడు ఆపేస్తావన్నా?' 'నీది రాయచోటి కదా బ్రో.. ‘కోలం’ కర్ణాటక బోర్డర్‌లో కదా జరిగేదంటూ' మరో నెటిజన్ కామెంట్ చేశారు. కాంతార సినిమాపై కిరణ్ పాజిటిన్‌గానే ట్వీట్ చేసినా.. నెటిజన్స్ అతన్ని టార్గెట్ చేయడం గమనార్హం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement