త్వరలో ఉపాసన ఇంట పెళ్లి బాజాలు | Upasana Konidela Sister Anushpala Engagement With Armaan Ebrahim | Sakshi
Sakshi News home page

Upasana: ఉపాసన సోదరి ఎంగేజ్‌మెంట్‌! సెలబ్స్‌ విషెస్

Published Sun, Jul 18 2021 2:03 PM | Last Updated on Sun, Jul 18 2021 2:04 PM

Upasana Konidela Sister Anushpala Engagement With Armaan Ebrahim - Sakshi

Upasana Sister Anushpala Kamineni: ఉపాసన కొణిదెల, రామ్‌చరణ్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఉపాసన చెల్లెలు అనుష్పాల కూడా తను ప్రేమించిన వ్యక్తిని మనువాడబోతోంది. అథ్లెట్‌ అర్మన్‌ ఇబ్రహీంతో కొన్నాళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్న ఆమె అతడితో త్వరలోనే ఏడడుగులు వేయనుంది. ఈ మేరకు తాజాగా వీరిద్దరికీ నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అతడితో కలిసి దిగిన ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది అనుష్పాల. అటు ఉపాసన కూడా ఇదే ఫొటోను తిరిగి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ 'నా డార్లింగ్స్‌కు అభినందనలు' అంటూ రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌పై ఆమె అభిమానులతో పాటు కాజల్‌, తమన్నా వంటి పలువురు సెలబ్రిటీలు స్పందిస్తూ ఉపాసన సోదరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

కాగా మాజీ ఇండియన్‌ ఎఫ్‌ 3 ఛాంపియన్‌ అక్బర్‌ ఇబ్రహీం తనయుడే అర్మన్‌ ఇబ్రహీం. ఇతడు కార్‌ రేసర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక అనుష్పాల విషయానికొస్తే.. అపోలో గ్రూప్‌ చైర్మన్‌ ప్రతాప్‌ రెడ్డి, దోమకొండ కోటకు చెందిన ఉమాపతి రావుల మనవరాలు, శోభన- అనిల్‌ కామినేనిల కూతురే అనుష్పాల.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement