List Of Upcoming Movie Releases In OTT And Theatres On Nov 1st Week 2022 - Sakshi
Sakshi News home page

OTT And Theatres Releases: సినిమాల జాతర.. థియేటర్‌లో, ఓటీటీలో వచ్చే చిత్రాలివే!

Published Mon, Oct 31 2022 6:00 PM | Last Updated on Mon, Oct 31 2022 10:05 PM

Upcoming Movies, OTT Releases In November 1st Week - Sakshi

బాక్సాఫీస్‌కు, ఓటీటీకి ఈ వారం నువ్వానేనా? అన్న రీతిలో పోటీ సాగేట్లు కనిపిస్తోంది. బోలెడన్ని సినిమాలు థియేటర్లో రిలీజయ్యేందుకు క్యూ కట్టగా అటు ఓటీటీలో కూడా సినిమాల జాతర జరగనుంది. మరి అటు థియేటర్‌, ఇటు ఓటీటీలో వచ్చే సినిమాలేంటో చూసేయండి..

లైక్‌ షేర్‌ సబ్‌స్క్రైబ్‌..
సంతోశ్‌ శోభన్‌, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం లైక్‌ షేర్‌ సబ్‌స్క్రైబ్‌. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ మూవీ నవంబర్‌ 4న విడుదల కానుంది.

ఊర్వశివో రాక్షసివో..
అల్లు శిరీష్‌, అను ఇమ్మాన్యుయేల్‌ జంటగా నటించిన సినిమా ఊర్వశివో రాక్షసివో. రాకేశ్‌ శశి డైరెక్ట్‌ చేసిన ఈ మూవీకి అచ్చు రాజమణి సంగీతం అందించారు. ఈ మూవీ కూడా ఈ శుక్రవారం అంటే నవంబర్‌ 4న రిలీజ్‌ కానుంది.

బొమ్మ బ్లాక్‌బస్టర్‌
నందు, యాంకర్‌ రష్మీ హీరోహీరోయిన్లు నటించిన సినిమా బొమ్మ బ్లాక్‌బస్టర్‌. రాజ్‌ విరాట్‌ డైరెక్ట్‌ చేసిన ఈ మూవీకి ప్రశాంత్‌ విహారి సంగీతం అందించాడు. ఈ సినిమా వచ్చే నెల 4న విడుదలవుతోంది.

బనారస్‌
జైద్‌ ఖాన్‌, సోనాల్‌ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ బనారస్‌. జయతీర్థ డైరెక్ట్‌ చేసిన ఈ చిత్రం కూడా నవంబర్‌ నాలుగో తారీఖున ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

తగ్గేదేలే
నవీన్‌ చంద్ర, దివ్య పిళ్లై, అనన్య సేన్‌ గుప్తా తదితరులు ముఖ్య పాత్ర పోషించిన మూవీ తగ్గేదేలే. శ్రీనివాసరాజు డైరెక్ట్‌ చేసిన ఈ మూవీకి చరణ్‌ అర్జున్‌ సంగీతం అందించాడు. ఈ చిత్రం నవంబర్‌ 4న విడుదలవుతోంది.

జెట్టి
నందిత శ్వేత, మాన్యం కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ జెట్టి. సుబ్రహ్మణ్యం పిచ్చుక దర్శకత్వం వహించిన ఈ చిత్రం కూడా నాలుగో తేదీన రిలీజవుతోంది.

మిలి
బాలీవుడ్‌ హీరోయిన్‌ జాన్వీ కపూర్‌ ప్రధాన పాత్రలో నటించిన సినిమా మిలి. ముత్తుకుట్టి జేవియర్‌ డైరెక్ట్‌ చేసిన ఈ చిత్రానికి ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించాడు. ఇది కూడా ఈ శుక్రవారమే విడుదల కానుంది.

ఓటీటీలో అలరించనున్న చిత్రాలు..

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో
► పొన్నియిన్‌ సెల్వన్‌ 1 - నవంబర్‌ 4
► మై పోలీస్‌ మ్యాన్‌ - నవంబర్‌ 4

ఆహా
► అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే (మూడో ఎపిసోడ్‌) - నవంబర్‌ 4
► పెట్టకాలి- నవంబర్‌ 4

నెట్‌ఫ్లిక్స్‌
► ఇన్‌సైడ్‌ మ్యాన్‌ - అక్టోబర్‌ 31
► ది ఘోస్ట్‌ - నవంబర్‌ 2
► కిల్లర్‌ సాలీ - నవంబర్‌ 2
► మేనిఫెస్ట్‌ 4వ సీజన్‌(వెబ్‌ సిరీస్‌)- నవంబర్‌ 4
► ఎనోలా హోమ్స్‌ 2 - నవంబర్‌ 4
► లుకిసిమ్‌ - నవంబర్‌ 4
► దావిద్‌ - నవంబర్‌ 4
► బుల్లెట్‌ ట్రైన్‌ - నవంబర్‌ 5

హాట్‌స్టార్‌
► బ్రహ్మాస్త్ర - నవంబర్‌ 4

సోనీలివ్‌
► కాయుమ్‌ కలవుమ్‌ - నవంబర్‌ 4

చదవండి: కాంతారలో ఏముందని ఎగబడుతున్నారు? డైరెక్టర్‌పై ట్రోలింగ్‌
బిగ్‌బాస్‌ 6 విన్నర్‌ నేనే : ఇనయ అనౌన్స్‌మెంట్‌తో పకపకా నవ్విన శ్రీహాన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement