Krithi Shetty Old Dance Videos: కృతీ శెట్టి డ్యాన్స్‌ వీడియో చూశారా? - Sakshi
Sakshi News home page

కృతీ శెట్టి డ్యాన్స్‌ వీడియో చూశారా?

Published Tue, Apr 6 2021 3:48 PM | Last Updated on Tue, Apr 6 2021 5:12 PM

Uppena Movie Heroine Krithi Shetty Old Dance Video Viral - Sakshi

ఫస్ట్‌ సినిమాతో హిట్టు కొట్టడం అందరికీ సాధ్యం కాదు. కానీ బేబమ్మ మాత్రం తన తొలి చిత్రం 'ఉప్పెన'తో హిట్టు కొట్టడమే కాదు ఏకంగా స్టార్‌ హీరోలతో సినిమా చాన్స్‌లు దక్కించుకుంటూ ఫుల్‌ బిజీగా మారింది. ఇప్పటికే నేచురల్‌ స్టార్‌ నానితో శ్యామ్‌సింగరాయ, సుధీర్‌బాబుతో 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'తో పాటు ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ సినిమాలోనూ నటిస్తోంది కృతీ శెట్టి. అలాగే సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు సరసన కూడా నటించనుందన్న వార్తలు టాలీవుడ్‌లో గత కొద్దిరోజులుగా చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే.

ఇదిలా వుంటే ఈ భామ స్టెప్పులేసిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియో పాతదే కానీ, అందులో ఆమె వేసిన స్టెప్పులు మాత్రం కొత్తవి. ఇందులో సన్నటి మెరుపుతీగలా ఉన్న కృతి మెలికలు తిరుగుతూ డ్యాన్స్‌ చేసి అదరగొట్టింది. ఇక గతంలోనూ ఆమె 'ఉప్పెన' సినిమాలోని 'ఈశ్వరా.. పరమేశ్వరా..' పాటకు స్పెషల్‌ పర్‌ఫార్మెన్స్‌ ఇచ్చి అందరీన అబ్బురపరిచిన విషయం తెలిసిందే.

చదవండి: ‘ఉప్పెన’ డిలీటెడ్‌ సీన్‌.. ఆ అమ్మాయి కాళ్లు పట్టుకున్న వైష్ణవ్‌

కరీనా రెండో కొడుకు ఫోటో షేర్‌ చేసిన రణ్‌ధీర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement