సూపర్ హీరో సినిమాలు మనకు కొత్తేం కాదు. హాలీవుడ్ పుణ్యమా అని చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ దగ్గర నుంచి బోలెడంతమంది మనకు తెలుసు. ఇవి చూసినప్పుడల్లా మన దగ్గర అలాంటి సినిమాలు రావట్లేదే అని బాధపడుతుంటాం. అలాంటి వాళ్ల కోసమే ఓ లోకల్ సూపర్ హీరో సినిమా తాజాగా ఓటీటీ విడుదలకు సిద్ధమైపోయింది.
తెలుగులో సూపర్ హీరో సినిమాలు పెద్దగా రాలేదని చెప్పొచ్చు. గతేడాది మలయాళంలో వచ్చిన 'మిన్నల్ మురళి' ఈ తరహా కథతోనే తీశారు. అది ఓటీటీలోకి వచ్చిన తర్వాత తెలుగు ప్రేక్షకులు చూసి దానికి ఫిదా అయిపోయారు. ఈ మధ్యే తమిళంలో 'వీరన్' అనే సూపర్ హీరో మూవీ తీశారు. జూన్ 2న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ని ఇప్పుడు ఫిక్స్ చేశారు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి సూపర్‌హిట్ 'గురక సినిమా'.. అస్సలు మిస్సవ్వొద్దు!)
ప్రముఖ సంగీత దర్శకుడు హిప్ హాప్ తమిళ ప్రధాన పాత్రలో నటించిన 'వీరన్' సినిమా జూన్ 30 నుంచి అమెజాన్ ప్రైమ్ లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు. ఫాంటసీ కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తీసిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చేస్తుందని చిత్రబృందం భావిస్తోంది.
'వీరన్' కథేంటి?
వీరనూర్ అనే ఊరిలో కుమార్(హిప్ హాప్ తమిళ) మెరుపు దాడికి గురై కోమాలోకి వెళ్తాడు. దీంతో తండ్రి అతడిని సింగపూర్ పంపిస్తారు. అలా చాలా ఏళ్ల తర్వాత కుమార్ సొంతూరికి తిరిగొస్తాడు. గతంలో జరిగిన దాడి వల్ల అతడికి సూపర్ పవర్స్, ప్రత్యేకమైన శక్తులు వస్తాయి. అలా ఊరికి వచ్చిన కుమార్.. ఓ ప్రమాదాన్ని తప్పిస్తాడు. ఇంతకీ వీరనూర్ కి వచ్చిన ప్రమాదమేంటి? కుమార్ ఎలా కాపాడాడు అనేది స్టోరీ.
Our #Veeran has arrived with electrifying powers ⚡
— Hiphop Tamizha (@hiphoptamizha) June 24, 2023
will he be able to save his village from a technological threat? find out in this one-of-a-kind superhero fantasy comedy#VeeranOnPrime, June 30@PrimeVideoIN pic.twitter.com/uX4dUPPG66
(ఇదీ చదవండి: 'ప్రాజెక్ట్ K'లో కమల్ హాసన్.. వీడియోతో క్లారిటీ)
Comments
Please login to add a commentAdd a comment