
విక్రమ్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రం తరువాత విశ్వనటుడు కమల్ హాసన్ ఇండియన్–2 చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీంతో కమల్ హాసన్ తన 234వ చిత్రాన్ని మణిరత్నం దర్శకత్వంలో చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దానికంటే ముందు హెచ్ వినోద్ దర్శకత్వంలో ఒక చిత్రం చేయబోతున్నారు. ఇది ఆయన నటించే 233వ చిత్రం అవుతుంది.
ఇది వ్యవసాయంతో పాటు పలు సామాజిక సమస్యల నేపథ్యంలో సాగే కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. వినోద్ చెప్పిన కథ నచ్చడంతో కమల్ హాసన్ ఇందులో నటించడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. వీరిద్దరూ కలిసి కథలో మార్పులు చేర్పులు చేసి మరింత పఠిష్టంగా తయారు చేసినట్లు సమాచారం. రాజ్‌కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించనున్న ఇందులో నటుడు విజయ్‌సేతుపతి కూడా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈయన ఇంతకుముందు విక్రమ్ చిత్రంలో ప్రతినాయకుడిగా నటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాలోనూ విలన్‌గా నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక ఈ చిత్ర షూటింగ్‌ను ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో త్రిష కథానాయికగా నటించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్టు గురించి పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొద్దిరోజులు ఆగాల్సిందే.
చదవండి: హీరోయిన్ హనీరోజ్ సాహసం.. అక్కడ ముద్దు పెట్టేసిందిగా
Comments
Please login to add a commentAdd a comment