Yaaneea Bharadwaj Indrani Official Teaser Out Now - Sakshi
Sakshi News home page

Indrani Movie Teaser: సూపర్‌ హీరో ఇంద్రాణి టీజర్‌ వచ్చేసింది..

Oct 14 2022 7:19 PM | Updated on Oct 14 2022 8:36 PM

Yaaneea Bharadwaj Indrani Official Teaser Out Now - Sakshi

ఇంద్రాణి భుజంపై ఉన్న రోబో చాలా బాగుంది, దానితో పాటు ఇంద్రాణి, ఇ- మ్యాన్‌లు వాడే సూపర్ పవర్స్ పిల్లలను, పెద్దలను త‌ప్ప‌క‌ ఆకట్టుకుంటాయి`` అన్నారు. దర్శకుడు స్టీఫెన్ పల్లం మాట్లాడుతూ..``ఇంద్రాణి మూడు ఎలిగేటర్లతో చేసే ఫైట్స్,

ట్రైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిన చిత్రాల‌కు మంచి డిమాండ్ ఉంది. అలాంటి కాన్సెప్ట్‌తో తెలుగు, త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో రూపొందుతున్న సూపర్ హీరో మూవీ `ఇంద్రాణి`. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్స్‌, మేకింగ్ వీడియోకి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా ఈ మూవీ టీజ‌ర్‌ను ప్ర‌ముఖ హీరో మంచు విష్ణు విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. 'ఇంద్రాణి లాంటి ఒక కొత్త త‌రం మూవీని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తున్న చిత్ర యూనిట్‌కు నా అభినంద‌న‌లు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరియు విఎఫ్ఎక్స్ వర్క్ అత్యుత్తమ నాణ్యతతో ఉండి చక్కగా కొరియోగ్రఫీ చేసిన యాక్షన్ ఎపిసోడ్లను అవి నెక్స్ట్‌ లెవ‌ల్‌కి తీసుకెళ్లాయి' అన్నారు. 

నటుడు శివ బాలాజీ మాట్లాడుతూ.. 'ఇంద్రాణి భుజంపై ఉన్న రోబో చాలా బాగుంది, దానితో పాటు ఇంద్రాణి, ఇ- మ్యాన్‌లు వాడే సూపర్ పవర్స్ పిల్లలను, పెద్దలను త‌ప్ప‌క‌ ఆకట్టుకుంటాయి`` అన్నారు. దర్శకుడు స్టీఫెన్ పల్లం మాట్లాడుతూ..``ఇంద్రాణి మూడు ఎలిగేటర్లతో చేసే ఫైట్స్, షతాఫ్ ఫిగర్‌తో జరిగే యాక్షన్ సీక్వెన్స్ సినిమాలో ప్రత్యేకంగా నిలుస్తాయి. తక్కువ సమయంలోనే సినిమాకి అద్భుతమైన విజువల్స్ అందించడానికి ఎంత‌గానో శ్రమిస్తున్న వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ శ్రీకాంత్ కందాలకు, ఆయన బృందానికి నా కృత‌జ్ఞ‌త‌లు`` అన్నారు.

చదవండి: ఏం పీకలేనన్నారు, ఇప్పుడు పీకి చూపిస్తా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement