మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌.. టీజర్ వచ్చేసింది! | Manchu Vishnu Latest Movie Kannappa Teaser Out Now | Sakshi
Sakshi News home page

Kannappa Teaser: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌.. టీజర్ వచ్చేసింది!

Published Fri, Jun 14 2024 3:34 PM | Last Updated on Fri, Jun 14 2024 5:10 PM

Manchu Vishnu Latest Movie Kannappa Teaser Out Now

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తోన్న చిత్రం కన్నప్ప. ఈ చిత్రంలో పలువురు అగ్రతారలు నటిస్తున్నారు.  ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ వంటి సూపర్ స్టార్స్‌ నటిస్తున్నారు. కాగా.. ఇటీవల కన్నప్ప టీజర్‌ను కేన్స్ ఫెస్టివల్‌లో ప్రదర్శించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టీజర్ రిలీజ్‌ చేశారు మేకర్స్. 

కాగా.. ఈ చిత్రాన్ని అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన కన్నప్ప ఫస్ట్ లుక్ పోస్టర్‌తో ఆడియెన్స్‌లో ఆసక్తిని మరింత పెంచేసింది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement