తీసుకున్న భూమికి పరిహారం అందించాలి
వాజేడు మండల పరిధిలోని చెరుకూరు గ్రామంలో జాతీయ రహదారి పక్కన పట్టా నంబర్ 106/3లో మా నాన్న కోరం శ్రీనివాస్‌రావు, సోదరుడు యుగేంధర్‌కు 2.18 ఎకరాల భూమి ఉంది. 2013–14లో అప్పుడు ఉన్న సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డు చేసినప్పుడు భూమిని తీసుకున్నారు తప్పా పరిహారం ఇవ్వలేదు. ఇప్పుడు అదే దారి రహదారి అయ్యింది. పట్టా భూమి తీసుకోవడం తప్పా ఎలాంటి పరిహారం చెల్లించలేదు. ఈ విషయంపై అధికారులు విచారణ చేపట్టి పరిహారం అందేలా చూడాలి.
– కోరం మనోజ్, చెరుకూరు, వాజేడు
పసుపు కుంకుమ కింద ఇచ్చిన భూమిని పట్టా చేయాలి..
నాకు ముగ్గురు కుమారులు, ఒక కూతురు. నాకున్న భూమిని ముగ్గురు కుమారులకు సమానంగా పంచి ఇచ్చాను. సర్వే నంబర్ 128/ఏ లోని 34గుంటలు, 128/బి సర్వే నంబర్‌లోని 34గుంటలను నాపేరు పైనే ఉంచుకున్నాను. అందులో నుంచి 128/బిలో భూమిని కుమార్తె రజితకు పసుపు కుంకుమల కింద ఇచ్చాను. ఆ భూమిని నా కుమారులు బుద్దె రవి, బుద్దె శంకర్‌లు తమ పేర్ల మీద దొంగపట్టా చేసుకోవాలని చూస్తున్నారు.
– బుద్దె పాపయ్య, బండారుపల్లి, ములుగు
●
తీసుకున్న భూమికి పరిహారం అందించాలి
Comments
Please login to add a commentAdd a comment