గవర్నర్ పర్యటనకు సర్వం సిద్ధం
ములుగు: గవర్నర్ జిష్టుదేవ్ వర్మ పర్యటనకు సర్వం సిద్ధం చేసినట్లు, కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ టీఎస్.దివాకర సూచించారు. ఈ మేరకు మంగళవారం గవర్నర్ దత్తత గ్రామం ఎస్‌ఎస్ తాడ్వాయి మండల పరిధిలోని కొండపర్తికి వస్తున్న క్రమంలో ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా, అదనపు కలెక్టర్లు మహేందర్‌జీ, సంపత్‌రావు, డీఎస్పీ రవీందర్‌తో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో సోమవారం కలెక్టర్ మాట్లాడారు. గవర్నర్ కొండపర్తిని పరిశీలించిన అనంతరం మేడారం వనదేవతలను దర్శించుకుంటారన్నారు. పర్యటన పూర్తి అయ్యేంత వరకు ఎక్కడా లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు. ప్రణాళికతో విధులు నిర్వహించి అధికారులు గవర్నర్ పర్యటనను విజయవంతం చేయాలని ఆదేశించారు. షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు ఉండేలా చూసుకోవాలన్నారు. అతిథిగృహంలో గదులను శుభ్రం చేయాలని, శానిటేషన్ పనులు చేపట్టాలన్నారు. పోలీసు శాఖ తరఫున కట్టుదిట్టమైన భద్రత చేపట్టాలని కోరారు. ఈ సమావేశంలో ఆర్డీఓ వెంకటేశ్, ఎంపీడీఓలు, తహసీల్దార్లు ఎంపీఓలు పాల్గొన్నారు.
కలెక్టర్ టీఎస్.దివాకర
Comments
Please login to add a commentAdd a comment