ఆంగ్లంలో మెళకువలు నేర్చుకోవాలి
వెంకటాపురం(ఎం): ఉపాధ్యాయులు ఆంగ్లంలో మెళకువలు నేర్చుకుని విద్యార్థులకు బోధించాలని జిల్లా సమగ్ర శిక్ష సెక్టోరల్ అధికారి అర్షం రాజు పేర్కొన్నారు. మండల పరిధిలోని జవహర్‌నగర్ మోడల్ స్కూల్‌లో దిశా ఫౌండేషన్ సహకారంతో జిల్లాలోని 54ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లిష్ బోధించే ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తుండగా ఆయన సో మవారం హాజరై ఉపాధ్యాయులను ఉద్దేశించి మా ట్లాడారు. విద్యార్థులకు వీడియో పాఠాల ద్వారా బోధన చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రతీ పాఠశాలకు వీడియో పాఠాల మెమోరీ కార్ట్స్, వర్క్‌బుక్‌లు, ప్లాష్‌కార్డులు, బోధనోపకరణాలు అందజేయనున్నట్లు తెలిపారు. వీడియో పాఠాల ద్వారా విద్యార్థులు 80 రోజుల్లోనే ఇంగ్లిష్‌లో మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో దిశా ఫౌండేషన్ ప్రతినిధులు ఐశ్వర్య, ప్రతిభ, ముబీన్‌లు పాల్గొన్నారు.
జిల్లా సమగ్ర శిక్ష సెక్టోరల్ అధికారి రాజు
Comments
Please login to add a commentAdd a comment