కల్వకుర్తిరూరల్: ఆర్టీసీ ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు డిమాండ్ చేశారు. సోమవారం కల్వకుర్తి ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులనుద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో రద్దీ విపరీతంగా పెరిగిందన్నారు. ఫలితంగా మహి ళలతో పాటు పురుషులకు సీట్లు దొరకని పరిస్థితి నెలకొందన్నారు. దీంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం కొత్త బస్సులను ఏర్పాటు చేయడంతో పాటు సిబ్బంది సంఖ్య పెంచాలని, కార్మికులపై పనిభారం తగ్గించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment