కొత్త ప్రతిపాదనలు ఇవే..
అచ్చంపేట–మహబూబ్నగర్–తాండూర్ మార్గంలో సుమారు 180 కిలోమీటర్ల కొత్త రైల్వేలైను కోసం రూ.360 కోట్లతో గతంలో కేంద్రం ఆమోదం తెలిపింది. దీనికి ఇప్పటివరకు నిధులు కేటాయించకపోవడంతో కాగితాలకే పరిమితమై ప్రతిపాదన దశలోనే ఉంది. 2007లో రూ.340 కోట్లతో ప్రతిపాదించిన జడ్చర్ల–నాగర్కర్నూల్–కొల్లాపూర్–నంద్యాల వరకు 170 కిలోమీటర్ల రైలు మార్గం ఆచరణలో అమలు కాలేదు. ఆయా లైన్లలో కనీసం ఒకటి, రెండు ప్రాజెక్టులకై నా తగిన కేటాయింపులు దక్కుతాయని ఉమ్మడి జిల్లావాసులు ఆశిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment