విద్యార్థుల ఉన్నతికి గురువులు కీలకం
కందనూలు: విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని డీఈఓ రమేష్ కుమార్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని లిటిల్ ప్లవర్ హైస్కూల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. ఉన్నత పాఠశాలల విద్యార్థులకు కెరీర్ గైడెన్స్‌పై కౌన్సెలింగ్ ఇచ్చేందుకు గాను జిల్లా విద్యాశాఖ, సమగ్రశిక్ష ఆధ్వర్యంలో 150 మంది ఉపాధ్యాయులకు రెండు రోజులపాటు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవడం.. విషయ పరిజ్ఞానం అందించడం.. నైతిక విలువలను నేర్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంటుందన్నారు. విద్యార్థులను ఉత్తమ భవిష్యత్ దిశగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రతి సర్కారు బడిలో కెరీర్ గైడెన్స్ అందుబాటులో ఉంచుతుందన్నారు. శిక్షణ అనంతరం ఉపాధ్యాయులు సమర్థవంతంగా విద్యార్థులకు మార్గనిర్దేశం చేయాలని సూచించారు. మారుతున్న కాలానికి అనుగణంగా విద్యార్థుల్లో విలువలతో కూడిన నైపుణ్యాలను పెంపొందించాలని.. వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకునేలా తీర్చిదిద్దాలన్నారు. పాఠశాలల్లో ఫ్రెండ్లీ టీచర్‌గా వ్యవహరించడం ద్వారా విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెంపొందుతుందని తెలిపారు. కార్యక్రమంలో మహబూబ్‌నగర్ డైట్ కళాశాల లెక్చరర్ లక్ష్మణ్, కెరీర్ గైడెన్స్ రాష్ట్రస్థాయి శిక్షకులు శోభారాణి, ఖలీలుల్లా, సెక్టోరియల్ అధికారి వెంకటయ్య, శోభారాణి, నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.
కెరీర్ గైడెన్స్ కౌన్సెలింగ్‌పై
ఉపాధ్యాయులకు శిక్షణ
Comments
Please login to add a commentAdd a comment