
ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్నిరకాల వైద్యసేవలు
కొల్లాపూర్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజలకు అన్నిరకాల వైద్యసేవలు అందిస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ డా.స్వరాజ్యలక్ష్మి అన్నారు. ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం కొల్లాపూర్ ఆస్పత్రిలో టీబీ రోగులకు న్యూట్రీషియన్ కిట్లు పంపిణీ చేశారు. ముందుగా ఆస్పత్రిలోని పలు రికార్డులను పరిశీలించి.. రోగులకు అందిస్తున్న వైద్యసేవలపై ఆరా తీశారు. అనంతరం డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందిస్తున్న వైద్యసేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ వెంకటదాసు, టీబీ ప్రోగ్రాం అధికారి రాజశేఖ ర్, ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసులు, టీబీ సూపర్‌వైజర్లు రాజ్‌కుమార్, ముఖ్తర్ అ హ్మద్, ఖరీఫ్‌ఖాన్, శ్రీనివాసులు పాల్గొన్నారు.