పాన్‌గల్: సింగిల్‌విండో ద్వారా తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించి అభివృద్ధికి సహకరించాలని డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. బుధవారం పాన్‌గల్ రైతువేదికలో నిర్వహించిన మహాజన సభకు ఆయన హాజరై మాట్లాడారు. విండో ద్వారా రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలతో పాటు రుణాలు అందిస్తున్నామన్నారు. అలాగే వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి ధాన్యం సేకరించినట్లు పేర్కొన్నారు. రూ.2 లక్షలలోపు పంట రుణాలు తీసుకున్న 1,433 మంది రైతులకు రూ.9.94 కోట్ల మాఫీ వర్తించిందని.. 887 మంది రైతులకు రూ.6.97 కోట్ల వరకు తిరిగి రుణాలు ఇచ్చినట్లు వివరించారు.
పంట రుణాలతో పాటు విద్య, గృహ నిర్మాణ, ఉపాధి రుణాలు అందిస్తున్నామని చెప్పారు. కర్షకమిత్ర ద్వారా రూ.10 లక్షల వరకు రైతులకు రుణాలు ఇవ్వడంతో పాటు వ్యవసాయ సామగ్రి కొనుగోలుకు 6 శాతం వడ్డీతో రుణాలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే మండల కేంద్రంలో సహకార బ్యాంకు ఏర్పాటు చేస్తామని.. మంత్రి జూపల్లి, ఎంపీ డా. మల్లు రవి సహకారంతో విండోను రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుపనున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్‌సాగర్, విండో వైస్‌చైర్మన్ కుర్వ బాలయ్య, సీఈఓ భాస్కర్‌గౌడ్ తదితరులు ఉన్నారు.
దివ్యాంగుల సమస్యలు పరిష్కరించండి
అచ్చంపేట రూరల్: అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని వికలాంగుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య, వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షురాలు తిరుపతమ్మ డిమాండ్ చేశారు. బుధవారం అచ్చంపేటలో నిర్వహించిన రాష్ట్ర మహిళా కార్యవర్గ సమావేశంలో వారు మాట్లాడారు. వికలాంగులకు గుర్తింపు, గౌరవం వచ్చిందంటే మందకృష్ణ మాదిగ పోరాట ఫలితమేనని అన్నారు.
ప్రతి జిల్లాలో మహిళా కమిటీలను ఏర్పాటుచేసి.. వికలాంగ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. వికలాంగులకు పింఛన్లు పెంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చి 16 నెలలు గడిచినా.. అమలుకు నోచుకో వడం లేదన్నారు. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించాలని, ప్రతి మండలంలో కనీ సం 10 మందికి రాయితీపై రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేందర్, రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కాశిరెడ్డి చైతన్యరెడ్డి, పద్మ, నాగమ్మ, శ్రీనివాసులు, కృష్ణంరాజు, శంకర్, లక్ష్మీనారాయణ, అచ్చాలి పాల్గొన్నారు.
నైపుణ్యాలుపెంపొందించుకోవాలి
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పరిశ్రమలకు అనుగుణంగా నైపుణ్యాలు పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని పాలమూరు యూనివర్సిటీ రిజిస్ట్రార్ మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. పీయూలో బుధవారం కెమిస్ట్రీ, ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ, ఫార్మసీ చివరి సంవత్సరం విద్యార్థులకు లారస్ ల్యాబ్ ఆధ్వర్యంలో క్యాంపస్ సెలక్షన్స్ నిర్వహించారు. ఈ మొత్తం 80 మంది విద్యార్థులు ఎంపికలో పాల్గొన్నారు. వీరికి ఇంటర్‌ూయ్వ, రాత పరీక్షలు నిర్వహించారు. ఎంపికై న విద్యార్థుల జాబితాను త్వరలో ప్రకటించనున్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ మధుసూదన్‌రెడ్డి, అధాపకులు రవికుమార్, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.

రుణాలు చెల్లించిఅభివృద్ధికి సహకరించాలి