పెద్దకొత్తపల్లి: మండలంలోని కొత్తపేట సమీపంలో ఉన్న బాలాజీ రైస్ మిల్లులో డీసీబీ కొత్తకొట శ్రీనివాస్‌రెడ్డి, ఎన్‌ఫోర్సుమెంట్ ఏహెచ్‌పీ ఆనంద్‌కుమార్ దాడులు నిర్వహించి 600 బస్తాల దొడ్డు బియ్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు విజిలెన్సు అధికారులు పట్టుకున్న 300 క్వింటాళ్ల బియ్యాన్ని మండల కేంద్రంలోని సివిల్ సప్లయ్ గోదాంకు తరలించారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచిన మిల్లు యాజమాని సునీల్‌కుమార్‌పై కేసు నమోదు చేసి పెద్దకొత్తపల్లి పోలీస్‌స్టేషన్ తరలించినట్లు అధికారులు చెప్పారు. దాడుల్లో విజిలెన్స్ ఎన్‌ఫోర్సుమెంట్ అధికారి రవీందర్, తహసీల్దార్ రాజశేఖర్‌రెడ్డి, సిబ్బంది నాగయ్య తదితరులు పాల్గొన్నారు.