విద్యార్థులు లక్ష్య సాధనకు శ్రమించాలి
కాంగ్రెస్ పాలనలో రైతులకు తప్పని కష్టాలు
ఫ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
కేతేపల్లి: రాష్ట్రంలో కాంగ్రెస్ అసమర్థ పాలన కారణంగా రైతులు నానా కష్టాలు పడుతున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్‌తో కలిసి బుధవారం కేతేపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి రైతులు సాగుచేసిన పంట పొలాలు కరెంట్, సాగునీరు సక్రమంగా అందక నిలువునా ఎండిపోతున్నా ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనతో పాడి, పంటలతో సంతోషంగా ఉన్న రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం బీడు భూములుగా మార్చిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పాలనలో రైతులు తమ పంటలను తామే కాల్చుకునే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. 50శాతం మంది రైతులకు కూఆ రూ.2లక్షల రుణమాఫీ అమలు జరగలేదన్నారు. ఎండిపోయిన పొలాలకు ఎకరాకు రూ.50 వేల నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నకిరేకల్ ఏఎంసీ మాజీ చైర్మన్ కొప్పుల ప్రదీప్‌రెడ్డి, మాజీ ఎంపీపీ బడుగుల శ్రీనివాస్‌యాదవ్, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మారం వెంకట్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ ఎ.వెంకన్న, బంటు మహేందర్, కొండ సైదులు, టి.వెంకన్న, జి.సత్యనారాయణగౌడ్, వెంకటేష్, అంజయ్య, మహేష్, పాపయ్య, సైదులు పాల్గొన్నారు.
దేవరకొండ, పెద్దవూర: విద్యార్థులు తాము ఎంచుకున్న లక్ష్య సాధనకు నిరంతరం శ్రమించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ శరత్ అన్నారు. బుధవారం దేవరకొండ మండల పరిధిలోని గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల, పెద్దవూరలోని సమీకృత బాలికల వసతి గృహాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న వసతులు, గ్రంథాలయాన్ని, పెద్దవూర హాస్టల్‌లో విద్యార్థులు, సిబ్బంది హాజరు పట్టికలు, వంట గదిని, స్టోర్ రూంలోని సామగ్రిని పరిశీలించి మాట్లాడారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. అధికారులు, సిబ్బంది, ఉపాధ్యాయులంతా సమన్వయంతో పనిచేసినప్పుడే అనుకున్న లక్ష్యాలు సాధించవచ్చన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం, అలసత్వాన్ని సహించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలలో నర్సులను నియమించి సిక్ రూమ్‌లు ఏర్పాటు చేసి అనారోగ్యానికి గురైన విద్యార్థులకు ఎప్పటికప్పుడు ప్రథమ చికిత్స చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విద్యార్థులకు కెరీర్ గైడెన్స్‌పై అవగాహన కల్పించారు. మెనూ అమలు తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు రాష్ట్రస్థాయిలో ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. కలెక్టర్‌తో మాట్లాడి వచ్చే విద్యా సంవత్సరానికి పెద్దవూరలోని బాలుర ఆశ్రమ పాఠశాలను ఇంటిగ్రేటెడ్ హాస్టల్‌కు మార్చి, ఇంటిగ్రేటెడ్ హాస్టల్‌ను మండల కేంద్రం సెంటర్‌లో ఉన్న ఆశ్రమ పాఠశాలకు మార్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆయా చోట్ల సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఆర్సీఓ బలరాం, ఏటీడీఓ ఎం.శ్రీనివాసులు, ప్రిన్సిపాల్ హరిప్రియ, వైస్ ప్రిన్సిపాల్ శ్వేత, దేవరకొండ ఏఎస్పీ మౌనిక, వార్డెన్లు అహల్యా, కొల్లు బాలకృష్ణ కొర్ర రాంసింగ్, శ్రీనునాయక్ తదితరులు ఉన్నారు.
ఫ గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ
విద్యార్థులు లక్ష్య సాధనకు శ్రమించాలి
విద్యార్థులు లక్ష్య సాధనకు శ్రమించాలి
Comments
Please login to add a commentAdd a comment