రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
వేములపల్లి(మాడ్గులపల్లి) : మూసీ ఎడమకాల్వ పరిధిలోని ఆయకట్టులో పంటలు ఎండిపోతున్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కోరారు. సోమవారం మాడ్గులపల్లి మండలంలోని పాములపాడు గ్రామంలో ఎండిపోతున్న వరి పొలాలను ఆయన పరిశీలించి మాట్లాడారు. మూసీ ప్రాజెక్టు కింద మాడ్గులపల్లి, వేములపల్లి, తిప్పర్తి మండలాల రైతులు ఎకరాకు రూ.40 వేలకు పైగా పెట్టుబడులు పెట్టి సాగు చేశారని.. చివరి దశలో పంట ఎండిపోతున్నా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. చివరి భూములకు నీరందించడంలో అధికారులు విఫలమయ్యారన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం, ఇరిగేషన్ అధికారులు స్పందించిన సాగునీటిని అందించాలని, ఇప్పటికే ఎండిపోయిన పొలాలకు ఎకరాకు రూ.20వేల నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డబ్బికార్ మల్లేష్, పాదూరి గోవర్ధని, పాదూరి శశిధర్‌రెడ్డి, రొండి శ్రీనివాస్, పతాని శ్రీను, తంగెళ్ల నాగమణి, అయితగాని విష్ణు, చింతచెర్ల శ్రీను, పిండి వెంకట్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, అల్గుబెల్లి వెంకట్‌రెడ్డి, గంగయ్యరావు, వెంకట్‌రెడ్డి, పద్మ పాల్గొన్నారు.
ఫ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment