ప్రజావాణి ఫిర్యాదులు పరిష్కరించాలి
నల్లగొండ : ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదుల పరిష్కారంపై దరఖాస్తుదారులకు వివరణ ఇవ్వాలని.. పరిష్కారం కాకపోతే.. ఎందుకు కావటం లేదో తెలియజేయాలన్నారు. ప్రజావాణికి జిల్లా అధికారులంతా తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. భూములకు సంబంధించిన కేసుల పరిష్కారంలో ఆర్డీఓలు, తహసీల్దార్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, స్పెషల్ కలెక్టర్ నటరాజ్, ఇన్‌చార్జి డీఆర్‌ఓ అశోక్‌రెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ కోటేశ్వరరావు, అధికారులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి
Comments
Please login to add a commentAdd a comment