పరీక్షల నిర్వహణలో పొరపాట్లు జరగొద్దు
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్లగొండ: ఇంటర్ పరీక్షల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం ఆమె జిల్లా కేంద్రంలోని ప్రగతి జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌తో కలిసి తనిఖీ చేశారు. కళాశాలకు కేటాయించిన విద్యార్థులు, గురువారం పరీక్షకు హాజరైన విద్యార్థుల వివరాలను పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరీక్షలు రాసే విద్యార్థిని, విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఇంటర్ విద్యాశాఖ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ అధికారులకు సూచించారు. ఆమె వెంట అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment