10న అప్రెంటిస్‌షిప్ మేళా
నల్లగొండ: జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలలో ఉత్తీర్ణులైన అన్ని ట్రేడ్ల అభ్యర్థులకు ఈ నెల 10న ఉదయం 10 గంటలకు నల్లగొండలోని ప్రభుత్వ ఐటీఐ (పాత) కళాశాలలో అప్రెంటిస్‌షిప్ చేసేందుకు ప్రధాన మంత్రి జాతీయ అప్రెంటిస్‌షిప్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఎ.నర్సింహాచారి ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు apprenticeshipindia.gov. inలో వారి పేర్లు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. అభ్యర్థులు బయోడేటా, విద్యార్హత ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలని కోరారు.
కోర్టు ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
రామగిరి(నల్లగొండ): నల్లగొండ జిల్లా కోర్టులో న్యాయ సేవాధికార సంస్థలో ఉద్యోగాల భర్తీకి సంస్థ చైర్మన్ ఎం.నాగరాజు గురువారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఖాళీగా ఉన్న టైపిస్ట్/అసిస్టెంట్(2) పోస్టులకు మార్చి 7 నుంచి 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు nalgonda.dcourts. gov.in వెబ్‌సైట్ నందు సంప్రదించాలని కోరారు.
15 నుంచి ఒక్కపూట బడులు
నల్లగొండ: ఈ నెల 15 నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఒక్కపూట నిర్వహించాలని డీఈఓ భిక్షపతి ఒక ప్రకటనలో తెలిపారు. ఎండల తీవ్రత పెరుగుతున్న కారణంగా ఆయా పాఠశాలలు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మాత్రమే నిర్వహించాలని పేర్కొన్నారు. పాఠశాలల చివరి పని రోజైన ఏప్రిల్ 23 వరకు ఒక పూట బడులు కొనసాగించాలని సూచించారు.
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
మర్రిగూడ: విద్యార్థులు చెడు వ్యసనాలు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో డీఎస్పీ పి.భిక్షపతిరావు అన్నారు. గురువారం మర్రిగూడ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు మత్తు పదార్థాలకు బానిసై తమ భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ సామ్యనాయక్, ఎస్‌ఐ మునగాల కృష్ణారెడ్డి, ఎంఈఓ బిట్టు శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయుడు కళా శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఉపకార వేతనాలకు దరఖాస్తులు
నల్గొండ: జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో చదువుతున్న షెడ్యూల్ కులాలకు చెందిన విద్యార్థులు 2024–25 విద్యా సంవత్సరం ఉపకార వేతనాలకు ఈ నెల 15లోగా telanganaepass.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత గల విద్యార్థులు వారి బ్యాంకు ఖాతాను ఆధార్ నంబర్‌తో సీడింగ్ చేసుకోవాలని పేర్కొన్నారు. కళాశాలల యాజమాన్యాలు ఈ సమాచారం విద్యార్థులకు తెలుపాలని కోరారు. ఙ
నేడు ఎస్‌ఆర్టీఆర్‌ఐలో జాబ్‌మేళా
భూదాన్‌పోచంపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం జలాల్‌పురంలోని స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థ(ఎస్‌ఆర్టీఆర్‌ఐ)లో శుక్రవారం జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ లక్ష్మి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీ్త్రలకు రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల, కొంగర కలాన్‌లోని ప్రముఖ మొబైల్ కంపెనీల్లో, పురుషులకు ఏపీలోని తిరుపతి జిల్లా శ్రీసిటీలోని ప్రముఖ ఏసీ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. పదో తరగతి, ఆపై చదివిన వారు అర్హులని పేర్కొన్నారు. ఎంపికై న సీ్త్ర, పురుషులకు రూ.14,500 నుంచి రూ.16,500 జీతం, ఉచిత బస్సు, భోజన సదుపాయం, పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యం ఉంటుందని తెలిపారు. ఆసక్తి కలిగిన వారు తమ విద్యార్హతల సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూకు నేరుగా హాజరుకావాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు సెల్ : 994846111, 7540084221 నంబర్లను సంప్రదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment