కల్తీ లేని ఆహారం అందించాలి
నల్లగొండ టూటౌన్: జిల్లా ప్రజలకు కల్తీ లేని ఆహారం అందించేలా ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం ఎస్పీ కార్యాలయం ఆవరణలో ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌తో కలిసి ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆహారంలో కల్తీని గుర్తించేందుకు ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించేందుకు ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ వాహనం ఉపయోగ పడుతుందన్నారు. దీనిద్వారా రహదారుల పక్కన ఉన్న హోటల్స్, చిరు వ్యాపారులు అమ్మే ఆహార పదార్థాలలో కల్తీ ఉందే లేదో పరీక్షలు చేయవచ్చన్నారు. ఆహార పదార్థాలు అమ్మే వారు ప్రభుత్వ నిబంధనలను పాటించాలని, లేదంటే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జ్మోతిర్మయి మాట్లాడుతూ ఈ వాహనం ద్వారా తక్షణ పరీక్షలు నిర్వహించి ఆహార నాణ్యతను నిర్ధారిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ ఇన్స్‌పెక్టర్ పి.స్వాతి, ఇతర అధికారులు శివశంకర్‌రెడ్డి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఎంజీ యూనివర్సిటీ సందర్శన
నీట్ పరీక్ష నిర్వహణ కోసం గురువారం మహాత్మాగాంధీ యూనివర్సిటీని కలెక్టర్ ఇలా త్రిపాఠి..ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌తో కలిసి సందర్శించారు. నీట్ పరీక్ష నిర్వహించడానికి యూనివర్సిటీలో సామర్థ్యం, తగిన సదుపాయాలను కలెక్టర్ పరిశీలించారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్ అల్వాల రవి, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ అరుణప్రియ యూనివర్సిటీల ఉన్న సౌకర్యాలను కలెక్టర్‌కు వివరించారు. వారి వెంట నల్లగొండ ఆర్డీఓ అశోక్‌రెడ్డి, ఎంజీయూ అధికారులు ఉన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి
కల్తీ లేని ఆహారం అందించాలి
Comments
Please login to add a commentAdd a comment