టాటా ఏస్ వాహనం దగ్ధం
కట్టంగూర్: ఇంజన్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా టాటా ఏస్ వాహనం దగ్ధమైంది. ఈ ఘటన కట్టంగూర్ మండలం కల్మెర గ్రామ పంచాయతీ పరిధిలోని సత్యనారాయణపురం శివారులో శనివారం జరిగింది. కట్టంగూర్ మండలం కురుమర్తి గ్రామంలో గేదెను తీసుకొచ్చేందుకు కట్టంగూర్ నుంచి టాటా ఏస్ వాహనంలో ఏనుగు కృష్ణ తన స్నేహితుడితో కలిసి బయల్దేరారు. మార్గమధ్యలో కల్మెర గ్రామ పంచాయతీ పరిధిలోని సత్యనారాయపురం శివారులోకి వెళ్లగానే ఇంజన్‌లో షార్ట్ సర్క్యూట్ జరిగి టాటా ఏస్ వాహనంలో మంటలు లేచాయి. మంటలు గమనించిన కృష్ణ వెంటనే వాహనాన్ని నిలిపివేయగా.. అతడితో పాటు అతడి స్నేహితుడు వాహనం నుంచి కిందకు దిగారు. విషయం తెలుసుకున్న నకిరేకల్ అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అప్పటికే వాహనం మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. సుమారు రూ.8లక్షలు నష్టం వాటిల్లినట్లు వాహన యజమాని కృష్ణ తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment