గంజాయి తరలిస్తున్న ఐదుగురి రిమాండ్
చౌటుప్పల్ రూరల్: గంజాయి తరలిస్తున్న ఐదుగురిని చౌటుప్పల్ పోలీసులు, ఎస్‌ఓటీ పోలీసులు పంతంగి టోల్‌ప్లాజా వద్ద పట్టుకుని రిమాండ్‌కు తరలించారు. శనివారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్‌లోని బాలాపూర్‌లోని ఎర్రకుంటకు చెందిన ఎండీ ఇమ్రానుద్దీన్, సంతోష్‌నగర్‌లోని హమీద్‌నగర్‌కు చెందిన అబ్దుల్ ఆసిఫ్, సంతోష్‌నగర్‌లోని కలేందర్‌నగర్‌కు మోసిన్‌ఖాన్, చాంద్రాయణగుట్టలోని ఆసిజ్‌బాబానగర్‌కు చెందిన ఎండీ అమీర్, సంతోష్‌నగర్‌లోని భువన్‌నగర్‌కు చెందిన సయ్యద్ ఇస్మాయిల్ సులభంగా డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో గంజాయి వ్యాపారం చేస్తున్నారు. ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్ నుంచి హైదరాబాద్‌కు రెండు కార్లలో గంజాయి తరలిస్తుండగా పక్కా సమాచారం మేరకు పంతంగి టోల్‌ప్లాజా వద్ద వారి కార్లను ఆపి తనిఖీ చేయగా రూ.7లక్షల విలువైన గంజాయి దొరికింది. అమీర్‌పై పాతబస్తీలోని పలు పోలీస్ స్టేషనల్లో గంజాయి కేసులు ఉన్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. వీరి నుంచి 22 కేజీల గంజాయి, 5 సెల్‌ఫోన్లు, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను పట్టుకున్న ఎస్‌ఐ కె. యాదగిరి, పోలీస్ సిబ్బందిని ఏసీపీ మధుసూదన్‌రెడ్డి అభినందించారు.
22 కిలోల గంజాయి, రెండు కార్లు,
5 సెల్‌ఫోన్‌లు స్వాధీనం
Comments
Please login to add a commentAdd a comment