ఆర్టీసీ అద్దె బస్సు ఢీకొని వ్యక్తి మృతి
ఆత్మకూరు(ఎం): ఆర్టీసీ అద్దె బస్సు బైక్‌ను ఢీకొట్టడంతో వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలో శనివారం జరిగింది. తిమ్మాపురం గ్రామానికి చెందిన శ్యామల రమేష్(34) సెంట్రింగ్ పనిచేస్తూ జీవనం సాగిస్తాడు. అతడి భార్య కూలి పనులు చేస్తూ భర్తకు చేదోడువాదోడుగా ఉంటోంది. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె సంతానం. శనివారం రమేష్ బైక్‌పై ఆత్మకూరు(ఎం) మండల కేంద్రానికి వస్తున్నాడు. ఈ క్రమంలో తిమ్మాపురం ఎక్స్ రోడ్డు వద్ద రాయిగిరి–మోత్కూరు రోడ్డు వైపు మళ్లుతుండగా.. హైదరాబాద్–2 డిపోకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు మరిపెడ బంగ్లాకు వెళ్తూ బైక్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రమేష్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ఎస్. కృష్ణయ్య తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment