రాష్ట్ర ఆర్థిక స్థితి యువతపై ఆధారపడి ఉంది
మిర్యాలగూడ : రాష్ట్రం ఆర్థికంగా ముందడుగు వేయాలంటే యువత తమ బాధ్యత గుర్తెరిగి నడుచుకోవాలని, రాష్ట్ర ఆర్థిక భవిష్యత్ నిర్ణేతలు యువతేనని తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఉపాధ్యక్షుడు, ప్రొఫెసర్ ఇ.పురుషోత్తం అన్నారు. మిర్యాలగూడలోని కేఎన్‌ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రధానాచార్యులు డాక్టర్ ఎస్.ఉపేందర్ అధ్యక్షతన ‘గ్రోత్ పొటెన్షియాలిటిస్ ఇన్ తెలంగాణ స్టేట్– ప్రొస్పాక్టస్ అండ్ ఛాలెంజ్’ అనే అంశంపై జరుగుతున్న జాతీయ సదస్సులో సోమవారం ఆయన మాట్లాడారు. తెలంగాణ ఎకనమిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ ముత్యంరెడ్డి ఆర్థిక విధానాల్లో సోషలిజం, మార్కెట్ ఎకానమీ మధ్య వ్యత్యాసం, వాటి ప్రయోజనాలు, మౌలిక భేదాలు, సామాజిక సామాన్య అభివృద్ధిపై వివరించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ధనిక రాష్ట్రమైన తెలంగాణాలో ప్రజలు బీదలుగా మారడానికి గల కారణాలను విశ్లేషించుకోవాలన్నారు. నేటి తెలంగాణ యువత ప్రతి విషయంలో అనాసక్తత కనబరిచి, నిర్వీర్య స్థితిలోకి వెళ్తోందన్నారు. ఇదే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని దిగజారుస్తోందన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్స్ ముత్యంరెడ్డి, కోటేశ్వర్‌రావు, పున్నయ్య, ఇంద్రకాంత్, ఎస్.రాములు, డాక్టర్ నరేష్, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment