పల్లెకో.. పోలీస్ అధికారి
నల్లగొండ : నేరాలను తగ్గించేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం కొత్త ప్రణాళికను రూపొందించింది. అందులో భాగంగా ఎస్పీ శరత్‌చంద్ర పవార్ ప్రతి గ్రామానికి ఒక పోలీస్ అధికారిని నియమించారు. వారంతా మంగళవారం నుంచి విధుల్లో చేరనున్నారు. ఆయా గ్రామాలకు నియమించిన పోలీస్ అధికారులు రోజూ క్రమం తప్పకుండా ఆ గ్రామానికి వెళ్లి అక్కడ ప్రజా సమస్యలను తెలుసుకోవడంతో పాటు నేరస్తులపై నిఘా పెట్టాల్సి ఉంటుంది. తద్వార గ్రామాల్లో నేరాలు తగ్గుముఖం పడతాయనేది పోలీస్ యంత్రాంగం ఉద్దేశం.
ప్రజలతో మమేకం కావాలి : ఎస్పీ
ఎస్పీ శరత్‌చంద్ర పవార్ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి గ్రామ పోలీస్ అధికారుల నియామకం, వారి విధులపై సూచనలు చేశారు. ప్రతి గ్రామ పోలీస్ అధికారి క్రమం తప్పకుండా ఆయా గ్రామానికి వెళ్లాలని ఆదేశించారు. గ్రామాల్లో ఉన్న సమస్యలు అధికారులకు తెలియజేసి.. వాటి పరిష్కారం దిశగా కృషి చేయాలన్నారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటూ మంచి సంబంధాలు కలిగి ఉండి గ్రామంలో నేరస్తులు, వారి కదలికలను, గ్రామానికి కొత్తగా వచ్చే అనుమానితుల యొక్క సమాచారాన్ని తెలుసుకోవాలన్నారు. తద్వారా గ్రామాల్లో నేరాలు నిరోధించగలుగుతామని పేర్కొన్నారు. గ్రామాల్లో మధ్యవర్తులు, పెద్ద మనుషుల ప్రభావంపై దృష్టి పెట్టాలన్నారు. ఫిర్యాదుదారులు ఎలాంటి భయాందోళనకు గురికాకుండా పైఅధికారిని కలిసే వాతావరణాన్ని కల్పించాలని సూచించారు.
ఫ గ్రామ పోలీస్ అధికారుల నియామకం
ఫ నేరాలు తగ్గించడమే ధ్యేయం
ఫ ప్రజా సమస్యలపై కూడా దృిష్టి
సారించాలని ఎస్పీ ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment