సమస్యల పరిష్కారమే ఎజెండా
నల్లగొండ టౌన్: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడమే కమ్యూనిస్టుల ఎజెండా అని సీపీఐ జాతీయ సమితి అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీగా ఎన్నికై న నెల్లికంటి సత్యంను గురువారం పార్టీ కార్యాలయంలో సన్మానించారు. ఎమ్మెల్సీ సత్యం మాట్లాడుతూ పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు పల్లా దేవేందర్‌రెడ్డి, పల్లా నర్సింహారెడ్డి, ఉజ్జిని రత్నాకర్‌రావు, మల్లేపల్లి ఆదిరెడ్డి, లొడంగి శ్రవణ్‌కుమార్, వీరస్వామి, వెంకటేశ్వర్లు, నర్సింహ, వెంకటేశ్వర్లు, రామచంద్రం, శ్రీనివాస్, ధనుంజయ, అక్బర్, యాదగిరి, ఎల్‌వీ యాదవ్, యాదయ్య, పంకజ్‌యాదవ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment