ప్రజల కోసం కలిసి పనిచేద్దాం
నల్లగొండ టౌన్: కమ్యూనిస్టులు పదవుల కోసం గాక ప్రజల కోసం పోరాడతారని అలాంటి వారితో కలిసి పని చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికై న సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్‌రెడ్డితో కలిసి గురువారం మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిశారు. ఈ సందర్భంగా సత్యంను కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ.. ఇరవై ఏళ్లు నిరంతరం ప్రజల కోసం పని చేసిన సత్యంను ఎమ్మెల్సీగా ఎన్నుకోవడం మంచి నిర్ణయమన్నారు. జిల్లా సమగ్రాభివృద్ధికి కలిసి పని చేద్దామన్నారు. కార్యక్రమంలో పల్లా నర్సింహారెడ్డి, ఉజ్జిని రత్నాకర్‌రావు, మల్లేపల్లి ఆదిరెడ్డి, పల్లా దేవేందర్‌రెడ్డి, శ్రవణ్‌కుమార్, వీరస్వామి పాల్గొన్నారు.
ఫ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment