రాష్ట్ర స్థాయి వికసిత్ భారత్‌కు 10మంది ఎంపిక
రామగిరి(నల్లగొండ): స్థానిక ఎన్జీ కళాశాలలో చేపట్టిన ‘వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్’ జిల్లా స్థాయి ఎంపిక పోటీలు గురువారం ముగిశాయి. నల్లగొండ, నాగర్ కర్నూల్, యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి పాల్గొన్న విద్యార్థుల్లో ఉత్తమ ప్రతిభ చూపిన 10 మందిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశారు. ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంజీయూ ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ మద్దిలేటి పాల్గొనగా.. న్యాయమూర్తులుగా పర్యావరణ వేత్త సురేష్ గుప్త, సామాజిక వేత్త దుచ్చర్ల సత్యనారాయణ, రిటైర్డ్ లెక్చరర్ విజయ్ కుమార్, నెహ్రూ యువకేంద్రం జిల్లా యువ అధికారి ప్రవీణ్ సింగ్ శిరీష వ్యవహరించారు. తెలుగుశాఖ అధ్యక్షుడు డాక్టర్ వెల్దండి శ్రీధర్, ఎన్‌ిసీసీ కేర్ టేకర్ సుధాకర్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారులు పాల్గొన్నారు .
Comments
Please login to add a commentAdd a comment