చెత్త వేయకుండా.. కొత్త ఆలోచన
రోడ్ల వెంట చెత్త వేసే ప్రాంతాల్లో.. మొక్కలు, ముగ్గులు
నల్లగొండ టూటౌన్ : రోడ్ల వెంట ఎక్కడపడితే చెత్త వేయకుండా నీలగిరి మున్సిపల్ అధికారులు వినూత్న ఆలోచన చేశారు. చెత్త వేస్తున్న రోడ్లను గుర్తించిన మున్సిపల్ సిబ్బంది, ఉద్యోగులు అక్కడ మొక్కలు నాటి నీళ్లు పోసి వాటిని పెంచుతున్నారు. మొక్కల చుట్టూ టైర్లు అమర్చడం, అక్కడ ముగ్గులు వేసి అందంగా తీర్చిదిద్దడంతో చెత్త వేయకుండా నివారించే ప్రయత్నం చేస్తున్నారు.
కాలనీల్లోనూ మొక్కలు నాటడం మేలు..
నీలగిరి పట్టణ పరిధిలోని కొన్ని కాలనీల్లో చెత్తను రోడ్ల వెంట, జనవాసాల మధ్య వేయడంతో స్థానికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పట్టణంలోని అలాంటి ప్రాంతాలను గుర్తించి అక్కడకూడా మొక్కలు నాటి వాటి చుట్టూ టైర్లు పెట్టి ముగ్గులు వేయడం ద్వారా చూడడానికి అందంగా కనిపిస్తుంది. ప్రజలు కూడా చైతన్యం అయి అక్కడ చెత్త వేయడానికి ఎవరూ సాహసించరు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు ఈ విధానానికి శ్రీకారం చుట్టాలని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment