నాంపల్లి : గ్రామాల్లో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. శుక్రవారం ఆమె నాంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. రాత్రి వేళ రోగులకు అందుబాటులో ఉండాలని సిబ్బందికి సూచించారు. అనంతరం స్థానిక కస్తూరిభా గాంధీ విద్యాలయాన్ని తనిఖీ చేశారు. డైనింగ్ హల్, వంట గదులను పరిశీలించారు. హస్టల్, పాఠశాలను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. ఆమె వెంట తహసీల్దార్ దేవ్‌సింగ్, ఎంపీడీఓ శ్రీనివాసశర్మ, వైద్యులు భవాని, తరుణ్, ఎంపీఓ ఝాన్సీ, సూపర్‌వైజర్ అంజలి ఉన్నారు.
ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు రాయితీపై ప్రచారం చేస్తాం
నల్లగొండ : ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 25 శాతం డిస్కౌంట్‌పై మరోసారి ప్రచారం చేస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో ఇప్పటికే రెండుసార్లు లే అవుట్ డెవలపర్స్‌తో సమావేశాలు నిర్వహించామని తెలిపారు. 1002 మంది ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుదారులు ఫీజు చెల్లించారని, వారికి ప్రొసీడింగ్స్ ఇచ్చామన్నారు. చిన్న చిన్న సమస్యలను అధిగమించి రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన గడువు ఈ నెల 31వ తేదీలోగా నూరు శాతం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, డీపీఓ వెంకయ్య, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి