సౌర విద్యుత్ అవగాహన సదస్సు గందరగోళం
నల్లగొండ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్న పీఎం కుసుమ్ కాంపోనెంట్ ఏ పథకంపై శనివారం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమం గందరగళంగా మారింది. ఈ పథకం కింద సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు కోసం నిర్వహించే సదస్సును నల్లగొండలోని విద్యుత్ ఎస్‌ఈ చాంబర్‌లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విద్యుత్ అధికారులతో పాటు నెడ్‌క్యాప్ అధికారి, లీడ్ బ్యాంకు అధికారులు, రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారు. దీంతో అక్కడ చాంబర్ సరిపోక.. అధికారుల తీరుపై రైతులు మండిపడ్డారు. పైగా విద్యుత్ శాఖ ఎస్‌ఈ కూడా ఈ సమావేశానికి రాలేదు. అవగాహన సదస్సు కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ప్రధాని ఫొటో కూడా పెట్టకపోవడంతో తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దీంతో చేసేది లేక అధికారులు సమావేశాన్ని రద్దు చేసి సాయంత్రం కలెక్టరేట్‌లోని ఉదయాదిత్య భవన్‌లో ఏర్పాటు చేశారు. రూ.2 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసే ఈ సోలార్ ప్లాంట్లపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు అనువజ్ఞులైన అధికారులు కూడా లేరు. దీంతో సదస్సును నామమాత్రంగా ముగించారంటూ రైతులు, నాయకులు ఆరోపించారు. పథకంపై అవగాహన కల్పించలేనప్పుడు సమావేశం పెట్టడం దేనికంటూ ప్రశ్నించారు. కార్యక్రమంలో నల్లగొండ ఆర్డీఓ అశోక్‌రెడ్డి, నెడ్ క్యాప్ అధికారి పాండురంగారావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment